(Local) Fri, 23 Aug, 2019

రేపో రేటును తగ్గించిన ఆర్బీఐ

August 07, 2019,   3:25 PM IST
Share on:

ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానం పై నేడు సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇది మూడో పరపతి సమీక్ష. ఈ సమీక్షలో ఆర్బీఐ ఓ తీపి కబురును చెప్పింది. ఈ సారి 35 బేసిక్ పాయింట్ల మేరకు కోత విధించింది. వరుసగా నాలుగోసారి ఆర్బీఐ రేపోరేటును తగ్గించింది. కీలకమైన రెపోరేటును 35 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 5.75 శాతంగా ఉన్న రెపో రేటును 5.40 శాతానికి, 5.50శాతంగా ఉన్న రివర్స్ రెపో రేటును 5.15శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. కాగా… ఆర్బీఐ నిర్ణయంతో గృహ, వాహన వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటు స్పల్పంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌, జూన్‌ మాసాల్లో రెపో రేటును సవరించడం ద్వారా 75 పాయింట్ల మేర కీలక రేట్లలో కోత విధించింది. సెప్టెంబర్‌లో మొదలయ్యే పండుగ సీజన్‌కు ముందే రుణాలపై వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గించాలని ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో సంకేతాలు పంపింది. మరోవైపు ఆర్‌బీఐ అందించిన వెసులుబాటును బ్యాంకులు ఎంత మేర తమ ఖాతాదారులకు వర్తింపచేస్తాయనేది వేచిచూడాలి. 
 

సంబంధిత వర్గం

విఫలమైన లావాదేవీలుచార్జీలు వసూలు చెయ్యద్దు - ఆర్బీ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.