(Local) Wed, 16 Oct, 2019

ఆర్బీఐ గుడ్ న్యూస్ -- కొత్త ఇళ్లు కొనేవారికి రిలీఫ్

October 04, 2019,   2:42 PM IST
Share on:
ఆర్బీఐ గుడ్ న్యూస్ -- కొత్త ఇళ్లు కొనేవారికి రిలీఫ ...

దసరా ముందు ఆర్ బీఐ అన్నివర్గాలవారిని మెప్పించేలా నిర్ణయం తీసుకుని గుడ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం సమావేశమైన ఆరుగురు సభ్యుల ద్రవ్యపరపతి విధాన కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్ బీఐ నిర్ణయాలతో ఇప్పుడు పేదవారికి ఉపశమనం కలగనుంది. అక్టోబర్ 1న రెపోరేటు తగ్గింపుపై సూచనలు చేసిన ఆర్ బీఐ గర్నవర్ శక్తికాంత్ దాస్ ఇవాళ కీలక విషయాలు వెల్లడించారు. ద్రవ్య పరపతి విధాన కమిటీ మూడు రోజుల సమావేశంలో రెపోరేటు పై నిర్ణయం తీసుకున్నారు. 25 బేసిస్ పాయింట్స్ తగ్గించడంతో రేపో రేటు 5.15శాతానికి చేరుకుంది.
ద్రవ్యోల్బణ ముప్పును తప్పించుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న ఆర్బీఐ సరైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ తరుణంలో వరుసగా రెపోరేటును తగ్గిస్తూ వస్తోంది. ఇప్పటివరకు వరుసగా ఐదోసారి రేపోరేటు తగ్గించింది. అంటే మొత్తం కలిపితే 135 బేసిస్ పాయింట్స్ తగ్గింది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే భారీగా వడ్డీ రేటు తగ్గినట్లే. అక్టోబర్ 1 నుంచి రెపోరేటు లింక్డ్ హోమ్ లోన్, వెహికల్ లోన్, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు మంజూరు చేసే విధానం మొదలైంది. ఇప్పుడు ఆర్బీఐ రేపోరేటు తగ్గించడంతో వడ్డీ రేట్లు కూడా భారీగా తగ్గి సామాన్యులకు ఊరట కలగనుంది. లోన్ల విషయంలో సామాన్యులకు భారం తగ్గి ఉపశమనం పొందనున్నారు. ఇళ్లు, వాహనాలు కొనేవాళ్లను కొత్త వడ్డీ రేట్లతో ఆకర్షించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

సంబంధిత వర్గం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.