(Local) Mon, 16 Sep, 2019

జియో ఫైబర్ ప్లాన్ వివరాలు

September 06, 2019,   10:28 AM IST
Views: 52
Share on:
జియో ఫైబర్ ప్లాన్ వివరాలు

టెలికం రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించిన జియో ఫైబర్ రంగంలోకి ప్రవేశించింది. సెప్టెంబర్ 5 నుంచి ఫైబర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటికి సంబంధించిన ప్లాన్లను బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినమ్, టైటానియం కేటగిరీలుగా డివైడ్ చేసింది.

జియో ఫైబర్ ప్లాన్ వివరాలు:

కనీస ప్లాన్ రూ.699 కాగా, గరిష్ఠ నెలవారీ ధర రూ.8,499గా నిర్ణయించింది.

కనీస ప్లాన్ రూ.699 తీసుకుంటే 100 ఎంబీపీఎస్ వేగంతో 100 జీబీ ప్లస్ 50 జీబీ డేటా వస్తోంది. దీనిలో ఉచిత వాయిస్ కాలింగ్ తో పాటు, టీవీ వీడియో కాలింగ్, కాన్ఫరెన్సింగ్ సదుపాయాలను కల్పించింది.

రెండో ప్లాన్ రూ.849: ఈ ప్లాన్ తీసుకుంటే 100 ఎంబీపీఎస్, 200 జీబీ ప్లస్, 200 జీబీ అదనపు డేటాతో ఉచిత వాయిస్ కాలింగ్ తో పాటు, టీవీ వీడియో కాలింగ్, కాన్ఫరెన్సింగ్ సదుపాయాలను కల్పించింది.

రూ.1299 ప్లాన్ తో 250 ఎంబీపీఎస్ వేగంతో డేటా వస్తోంది. దీనిలో 500 జీబీ ప్లస్ 250 జీబీ అదనపు డేటాను అందిస్తారు. 500 ఎంబీపీఎస్ వేగం కావాలనుకుంటే రూ.2,499 ప్లాన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఇందులో 1250 జీబీ ప్లస్, 250 జీబీ అదనపు డేటాను అందిస్తారు.

రూ.3,999 ప్లాన్ తో అయితే 2500 జీబీ వస్తోంది.

రూ.8,499 ప్లాన్ తో అయితే 5వేల జీబీల డేటాను పొందవచ్చు. ఈ రెండు ప్లాన్లలో డేటా వేగం 1జీబీపీఎస్ ఉంటుంది. ఉచిత వాయిస్ కాలింగ్, టీవీ వీడియో కాలింగ్, కాన్పరెన్సింగ్ సదుపాయాలు ఉంటాయి.

జియో ఫైబర్ వెల్ కమ్ ఆఫర్

జియో ఫరెవర్ వార్షిక ప్లాన్లను ఎంచుకునే వినియోగదారులకు వెల్ కమ్ ఆఫర్ ను ప్రకటించారు. ఇందులో భాగంగా వినియోగదారులు జియో హోం గేట్ వే, జియో 4కే సెటాప్ బాక్స్, టీవీ, ఓటీటీ యాప్స్ చందా వంటి వాటిని ఉచితంగా అందించనుంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.