(Local) Fri, 15 Nov, 2019

భూషణ్ స్టీల్ సంస్థ రూ.4,025 కోట్ల ఆస్తుల జప్తు

October 13, 2019,   1:04 PM IST
Share on:
భూషణ్ స్టీల్ సంస్థ రూ.4,025 కోట్ల ఆస్తుల జప్తు

భూషణ్ స్టీల్ సంస్థ బ్యాంకు రుణం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఆ సంస్థకు చెందిన రూ.4,025 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) శనివారం ప్రకటించింది. మనీలాండరింగ్ నిరోధక చట్ట( పిఎంఎల్‌ఎ) కింద ఒడిశాలో ఉన్న ఈ కంపెనీకి చెందిన భూమి,భవనం, ప్లాంట్, దానిలోని యంత్రపరికరాలను జప్తు చేసినట్లు ఇడి తెలిపింది. ఈ మొత్తం ఆస్తుల విలువ 4,025.23 కోట్లని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఇది తొలి జప్తు అని, మరిన్ని జప్తులు రాబోయే రోజుల్లో ఉంటాయని కూడా తెలిపింది. వివిధ బ్యాంకులనుంచి పొందిన రుణాలను పక్కదారి పట్టించడానికి భూషణ్ స్టీల్ రకరకాల మార్గాలను ఉపయోగించిందని కూడా ఇడి తెలిపింది.

సంబంధిత వర్గం
హెచ్‌టీటీ-40 విమానయానం అద్భుతం
హెచ్‌టీటీ-40 విమానయానం అద్భుతం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.