(Local) Tue, 17 Sep, 2019

ఎఫ్‌డి రేట్లను తగ్గించిన ఎస్‌బిఐ

August 24, 2019,   12:22 PM IST
Views: 56
Share on:
ఎఫ్‌డి రేట్లను తగ్గించిన ఎస్‌బిఐ

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ FD వడ్డీ రేట్లను మరోసారి తగ్గించింది. నెల రోజుల్లో FD రేట్లలో కోత ఇది రెండోసారి. తాజా రేట్ల తగ్గింపు ఈ నెల 26 నుంచి అమల్లోకి రానుంది. ఎస్‌బిఐ బ్యాంక్ FD రిటైల్ రేటును 10 నుంచి 50 బేసిస్ పాయింట్లకు తగ్గించింది. పెద్ద డిపాజిట్లు 30 నుండి 70 బేసిస్ పాయింట్లకు కోత పెట్టింది. అంతకుముందు ఎస్‌బిఐ తగ్గించిన రేట్లు ఆగస్టు 1 నుండి అమల్లోకి వచ్చాయి. స్వల్పకాలిక 179 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 0.5 నుంచి 0.75 శాతం తగ్గించినట్లు ఎస్‌బిఐ తెలిపింది. అదేవిధంగా దీర్ఘకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును రిటైల్ విభాగంలో 0.20 శాతం, టోకు డిపాజిట్లలో 0.35 శాతం తగ్గించారు. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ రూ .2 కోట్లు, అంతకంటే ఎక్కువ బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది.

26 ఆగస్టు 2019 నుండి ఈ ఎఫ్‌డిలు కొత్త రేట్లు
7 రోజుల నుండి 45 రోజుల వరకు – 4.50 శాతం
46 రోజుల నుండి 179 రోజుల వరకు – 5.50 శాతం
180 రోజుల నుండి 210 రోజుల వరకు – 6.00 శాతం
211 రోజుల నుండి 1 సంవత్సరం వరకు – 6.00 శాతం

రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డి వడ్డీ రేట్లు
1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు – 6.70 శాతం
2 సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల లోపు – 6.50 శాతం
3 సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల వరకు – 6.25 శాతం
5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు – 6.25 శాతం

సంబంధిత వర్గం
ఎస్ బీఐ ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్
ఎస్ బీఐ ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్
రుణదాతలకు ఎస్ బీఐ గుడ్ న్యూస్
రుణదాతలకు ఎస్ బీఐ గుడ్ న్యూస్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.