(Local) Thu, 05 Dec, 2019

ఇన్ఫోసిస్ లో విచారణ ప్రారంభించిన సెబీ

October 24, 2019,   3:20 PM IST
Share on:
ఇన్ఫోసిస్ లో విచారణ ప్రారంభించిన సెబీ

సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ లో ఆదాయాలను, నికర లాభాలను తప్పుగా చూపుతున్నారని అందుకు సీఈఓ సలిల్ పరేఖ్, సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ లు కారణమని ఆరోపిస్తూ, కొందరు ఉద్యోగుల బృందం రాసిన లేఖ, ఐటీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలకు కారణంకాగా, సెబీ ప్రాధమిక విచారణను ప్రారంభించింది. ఇప్పటికే ఉద్యోగుల బృందం నుంచి తామందుకున్న లేఖలను, కొన్ని వాయిస్ రికార్డులను, ఈమెయిల్స్ ను సెబీ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని ఆంగ్ల పత్రిక ‘బిజినెస్ స్టాండర్డ్’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఉద్యోగులు చేసిన ఆరోపణల్లోని తీవ్రత దృష్ట్యా, దర్యాఫ్తు చేయాలని భావిస్తున్నట్టు సెబీ అధికారులు తెలిపారు. మరోవైపు యూఎస్ లో సైతం ఇన్ఫోసిస్ లిస్టింగై ఉండటంతో, అక్కడికీ ఫిర్యాదులు వెళ్లాయి. వీటిని అందుకున్న అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సైతం రంగంలోకి దిగింది. కేసు విచారణలో సెబీ, ఎస్ఈసీలు కలిసి పని చేయనున్నాయి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.