(Local) Mon, 16 Sep, 2019

ఎస్ బీఐ ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్

September 09, 2019,   12:24 PM IST
Views: 32
Share on:
ఎస్ బీఐ ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్

ఎస్ బీఐ తన ఖాతాాదాారులకు మరో శుభవార్త చెప్పింది. రుణాలపై వడ్డీ రేటును మరో 10 బేస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఇలా ఈ ఆర్ధిక సంవత్సరంలో రుణాల పై వడ్డీరేట్లు తగ్గించడం ఇది ఐదో సారి. ఈ నెల 10 నుంచి తగ్గించిన వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ 10 నుంచి ఇప్పటి వరకు 45 బేసిస్ పాయింట్ల మేర రుణ వడ్డీ భారం తగ్గింది. ప్రస్తుతం ఎంసీఎల్ఆర్ రుణాల పై 8.25 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో ఇక నుంచి 8.15 శాతం వసూలు చేయనున్నారు. ఫిక్స్ డ్ డిపాజిట్ల పై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేట్లను కూడా ఎస్ బీఐ తగ్గించింది. బల్క్ డిపాజిట్ల పై 10 నుంచి 20 బేసిస్ పాయింట్లు, రిటైల్ ఫిక్స్ డ్ డిపాజిట్ల పై 20 నుంచి 25 బేసిస్ పాయింట్లను ఎస్ బీఐ తగ్గించింది. దీంతో ఏడాది నుంచి రెండేళ్ల కాపరిమితి ఉన్న డిపాజిట్లపై 6.7 శాతం వడ్డీ 6.5 శాతానికి తగ్గింది. ఇవన్నీ కూడా రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి.

సంబంధిత వర్గం
అంధుల కోసం ఆర్బీఐ ప్రత్యేక యాప్
అంధుల కోసం ఆర్బీఐ ప్రత్యేక యాప్
రూ. 100 నోట్లు నోట్లపై వార్నిష్‌ పూత
రూ. 100 నోట్లు నోట్లపై వార్నిష్‌ పూత

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.