(Local) Wed, 08 Jul, 2020

మరింత నష్టాలలో వొడాఫోన్ ఐడియా

November 15, 2019,   12:26 PM IST
Share on:
మరింత నష్టాలలో వొడాఫోన్ ఐడియా

టెలికాం రంగంలో విపరీతమైన పోటీ వాతావరణం కారణంగా వొడాఫోన్ ఐడియా క్యూ2(జులై-సెప్టెంబర్) త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను నమోదు చేసింది. సంస్థకు దాదాపు రూ.50,900 నష్టం వచ్చింది. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ నష్టం రూ.4,874 కోట్లుగా ఉంది. కోర్టు తీర్పు ప్రతికూలంగా ఉండడం వల్ల ఈసారి సంస్థ మరింత నష్టాల ఊబిలో కూరుకుపోయింది. కోర్టు తీర్పు అనంతరం కంపెనీ అప్పు రూ.44,150 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ రెండో త్రైమాసికంలో దాదాపు రూ.25,680 కోట్లు ప్రొవిజన్‌కు కేటాయించింది. అయితే వొడాఫోన్ ఇండియా రెవెన్యూ 42% పెరిగింది. రెవెన్యూ గతేడాదిలో రూ.7,878.6 కోట్ల నుంచి రూ.11,146.4 కోట్లకు చేరింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.