(Local) Fri, 22 Nov, 2019

రిలయన్స్ జియోకి షాక్ ఇచ్చిన వోడాఫోన్- ఐడియా

October 12, 2019,   12:50 PM IST
Share on:
రిలయన్స్ జియోకి షాక్ ఇచ్చిన వోడాఫోన్- ఐడియా

జియో నెట్ వర్క్ నుంచి ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ కు నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని రిలయన్స్ జియో ప్రత్యేక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో, ఆ సంస్థకు షాకిస్తూ, వినియోగదారుల పరంగా నంబర్ వన్ స్థానంలో ఉన్న వోడాఫో-ఐడియా మాత్రం తాము  ఎటువంటి ఐయూసీ చార్జీలను వసూలు చేసే ఉద్దేశం లేదని తెలిపింది. తమ వినియోగదారులు ఇతర నెట్‌ వర్క్‌ కాల్స్ కోసం ఎప్పటిలానే కాల్స్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. వినియోగదారులపై భారం పడకూడదనేదే తమ అభిమతమని తెలిపింది. ఇదే సమయంలో ఐయూసీ ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పడం తొందరపాటు చర్యని, ఇంటర్ కనెక్ట్‌ మధ్య నలుగుతున్న సమస్యకు ఇది పరిష్కారం కాదని వ్యాఖ్యానించింది. ఇదిలావుండగా, ఐయూసీ చార్జీల వ్యవహారం మొబైల్ ఆపరేటర్లు తేల్చుకోవాలే తప్ప వినియోగదారులకు సంబంధించిన విషయం కాదని గతంలోనే TRAI (Telecom Regulatory Authority of India) వెల్లడించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వర్గం
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.