(Local) Tue, 20 Aug, 2019

షామీ తొలి త్రైమాసికంలో 2.75కోట్ల స్మార్ట్‌ఫోన్లు

May 06, 2019,   11:13 AM IST
Share on:

 ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ, చైనాకు చెందిన షామీ ఇప్పుడు భారత్‌ స్మార్ట్‌ఫోన్‌ విపణిలో దూసుకుపోతోంది. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్‌కు దీటుగా విక్రయాలను జరుపుకొంటున్న షామీ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 2.75కోట్ల స్మార్ట్‌ఫోన్లను విపణిలోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. 2019 తొలి మూడు నెలల్లో 27.5మిలియన్‌లకు పైగా స్మార్ట్‌ఫోన్లను విపణిలోకి తీసుకొచ్చాం అని షామీ ఛైర్మన్‌ లియాజన్‌ తెలిపారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.