(Local) Fri, 06 Dec, 2019

మరో ఆఫర్ ను ప్రకటించిన జియో

November 28, 2019,   3:32 PM IST
Share on:
మరో ఆఫర్ ను ప్రకటించిన జియో

టెలికం రంగంలో ఎవ్వరికి అందనంత ఎత్తులో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం మరో సూపర్ ఆఫర్ ను ప్రకటించింది. సన్ గ్రూపునకు చెందిన సన్ నెక్స్ట్ ప్లాట్ ఫాంలోని కంటెంట్ ను  జియో సినిమా యాప్ లో జియో వినియోగదారులు ఉచితంగా వీక్షించవచ్చు.జియో సినిమా యాప్ లో రిలయన్స్ జియో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది జియో వినియోగదారులకు మాత్రమే అంబానీ ఉచితంగా అందించే స్ట్రీమింగ్ సర్వీస్ అని చెప్పచు.

ఇందులో వివిధ భాషలకు సంబంధించిన సినిమాలు అన్ని ఫ్రీగా చూడచ్చు. అంతేకాకుండా డిస్నీతో చేసుకున్న ప్రత్యేక ఒప్పందం ద్వారా డిస్నీకి సంబంధించిన సీరియల్స్, సినిమాలు కూడా ఇందులో ఫ్రీ గా చూడచ్చు. జీ5, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లో వచ్చే ఒరిజినల్ సిరీస్ లు, ఒరిజినల్ కంటెంట్ కాకుండా సన్ గ్రూప్ ఏ సినిమాల హక్కులను అయితే కొనుగోలు చేసిందో ఆ సినిమాలు అన్ని ఇందులో ఉంటాయి.

ప్రస్తుతం సన్ నెక్స్ట్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషలకు చెందిన కంటెంట్ అందుబాటులో ఉంది. దీంతో రూ.480 రూపాయిలను వినియోగదారులకు ఫ్రీగా ఇస్తుంది. అయితే ఇందులో ఫ్రీగా సినిమాలు చూసేందుకు జియో సినిమా యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అందులో లాగిన్ అవ్వాలి. అప్పుడు సన్ నెక్స్ట్ లో ఫ్రీగా సినిమాలు చూడచ్చు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.