(Local) Wed, 23 Oct, 2019

శని ప్రదక్షిణం తర్వాత వేరే దేవుడి గుడికెళ్లొచ్చా?

July 18, 2019,   11:14 PM IST
Share on:
శని ప్రదక్షిణం తర్వాత వేరే దేవుడి గుడికెళ్లొచ్చా?

చాలామందికి ఒక సందేహం ఉంది అది ఏంటంటే ... శనికి ప్రదక్షిణలు చేసిన తర్వాత ఏం చేయాలి? పక్కనే ఉన్న దేవాలయంలోకి వెళ్లవచ్చా? వెళ్లకూడదా? వంటి అనేక సందేహాలు. ఈ సందేహాలకు పలు శాస్ర్తాలలో పలు మార్గాలు చెప్పబడ్డాయి:

  •  శని గ్రహానికి ప్రదక్షిణలు చేసిన తర్వాత తప్పక కాళ్లు కడుగుకొని పక్కనే ఉన్న శివాలయం లేదా విష్ణు లేదా అమ్మవారు లేదా ఆంజనేయస్వామి దేవాలయంలో మరల కనీసం మూడు ప్రదక్షిణలు చేసి అక్కడ తీర్థం తీసుకుని ఇంటికి వెళ్లాలి.
  •  ఒకవేళ శనిదోష పరిహారం కోసం శనిత్రయోదశి పూజ, తైలాభిషేకం చేయించుకుంటే సాధ్యమైనంత వరకు ఆ దుస్తులపై నుంచి స్నానం చేయడం, అవకాశం ఉంటే ఆ దుస్తులను పారవేసి, వెంట తీసుకువెళ్లిన మరో దుస్తులను ధరించి పక్కనే ఉన్న దేవతామూర్తులకు ప్రదక్షిణం చేసి తీర్థం తీసుకోవాలి.
  •  ఒకవేళ శనిత్రయోదశి లేదా తైలాభిషేకం చేసిన తర్వాత స్నానం చేయడానికి ఎట్టి అవకాశం లేకుంటే కనీసం కాళ్లు, ముఖం కడుగుకొని, ఆచమనం చేసి పక్కనే ఉన్న దేవతామూర్తులకు ప్రదక్షిణ చేసి తీర్థం తీసుకుని ఇంటికి వెళ్లాలి. ఇంట్లో తప్పక ఆ దస్తులను మార్చుకుని స్నానం చేసి ఇంట్లో దేవునికి నమస్కారం చేసుకుని తర్వాత ఏదైనా పని చేసుకోవచ్చు.
  •  ఇక నవగ్రహాలకు సాధారణంగా ప్రదక్షిణ చేసిన తర్వాత తప్పక కాళ్లుచేతులూ కడుగుకొని పక్కనే ఉన్న ఏ దేవతలకైనా ప్రదక్షిణ, తీర్థం తీసుకోవడం ఉత్తమం అని పండితులు పేర్కొంటున్నారు.
  •  ఇక తెలిసింది కదా శనికి ప్రదక్షిణం చేస్తే, పూజ చేస్తే ఆచరించాల్సిన ప్రక్రియలు. పెద్దలు చెప్పిన విధానంలో ఆచరించి ఉత్తమ ఫలితాలు పొందండి.
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.