(Local) Fri, 24 Jan, 2020

కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 10వ అధ్యాయం

November 07, 2019,   1:00 PM IST
Share on:
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 10వ అధ్యాయం

"కార్తీకమాసం" అనగా చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి "కార్తీకమాసం" అని పేరు వచ్చింది.

కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు:- 
కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించవలెను.నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది.వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమి రోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను

కార్తీకమాసమంతా కార్తీక పురాణం 30 అధ్యాయాల్లో రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభప్రదం.

కార్తీకపురాణం - 10వ అధ్యాయం

|| అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము ||

అజామీళుని విష్ణుదూతలు వైకుంఠనికి తీసుకునిపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మారాజు వద్దకి వెళ్లి " ప్రభూ! తమ ఆజ్ణాప్రకారము అజామీళుని తీసుకురావడానికి వెళ్ళగా అక్కడికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీళుని విమానమెక్కించి వైకుంఠనికి తీదుకుపోయారు. మేము ఏమిచేయలేక విచారంతో తిరిగి ఇక్కడికి వచ్చము ప్రభూ" అని భయకంపితులై విన్నవించారు.
"ఔరా! ఎంతపని జరిగెను? ఎప్పుడు ఈ విధంగా జరగనేలేదే? దీనికి బలమైన కారణము ఎదైన వుండవచ్చు" అమ్ యముడు తన దివ్యదృష్టితో అజామీళుని పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకొని " ఓహో! అదా సంగతి! తన అవసానకాలమున"నారాయణ" అని వైకుంఠవాసుని నామస్మరణచేసి వుండెను. అందువలన విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకుపోయరు. తెలియకగాని తెలిసిగాని మృత్యుసమయన హరినామ స్మరణ ఎవరు చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగుతుంది. కనుక అజామీళునికి వైకుంఠప్రాప్తి కలిగెను కదా!" అని అనుకొనెను.
అజామీళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒకానొక శివాలయంలో అర్చకుడిగా వుండెను. అతడు తన అపురూపమైన అందంచేతను, సిరిసంపదలచేతను, బలముచేతను గర్విష్ఠియై వ్యభిచారియై శివారాధన చేయక, శివాలయం ధనం అపహరిస్తు, శివుని విగ్రహమువద్ద ధూపదీప నైవెద్యములను కూడా పెట్టక, దుష్టసాహవాసములు మరిగి విచ్చలవిడిగా తిరుగుతుండెవాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు వుంచి పడుకునేవాడు ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధముండెది. ఆమెకూడా అందమైనది అగుటచేత చేసేదిలేక ఆమె భర్త చూసిచూడనట్లు వుండి భిక్షాటనకై వూరూరా తిరుగుతూ ఏదోవేళకు వచ్చి కాలం గడుపుతుండెవడు. ఒకనాడు పొరుగురికి వెళ్లి యాచనచేసి పెద్దమూటతో బియ్యము, కూరలు నెత్తినపెట్టుకొని వచ్చి అలసిపోయి " నాకు ఈరోజు ఆకలి ఎక్కువగా వున్నది త్వరగా వంటచేసి పెట్టుము" అని భార్యతో అనెను. అందుకామె చీదరించుకొంటు, నిర్లక్ష్యంగా కాళ్లు కడుకోవడానికి నీళ్లుకూడా ఇయ్యక, అతని వంక కన్నెత్తికూడా చూడక విటునిపై మనస్సుగలదై అతని తూలనాడుటవలన భర్తకు కోపము వచ్చి ములనున్న కర్రతో బాదెను. అంతటితో ఆమె భర్త చేతినుండి కర్ర లక్కొని భర్తను రెండింతలు కొట్టి బైటకు త్రోసి తలుపులు మూసేసను. అతడు చేసేదిలేక భర్యపై విసుగు జనించటంవలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెళ్లిపోయెను. దానికి భర్య సంతోషించి, రాత్రిబాగా ముస్తబై వీధి అరుగుపై కూర్చుండి వుండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను. అతనిని పిలిచి ' ఓయీ! నీవీరాత్రి నాతో రతికీడ సలుపుటకురా!' అని కోరెను. దానికి చాకలి " తల్లీ! నీవు బ్రాహ్మణపడతివి. నేను నీచకులస్తుడను, చాకలివాడిని. మీరీవిధంగా పిలవడం యుక్తముకాదు. నేనిట్టి పాపపు పని చేయను" అని బుద్ధిచెప్పి పోయెని. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్బుకొని అక్కడి నుండి బయలుదేరి ఆగ్రామ శివార్చకుడు దగ్గరికి వెళ్లి తన కామవాంఛ తీర్చమని పరిపరివిధముల బ్రతిమాలి ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయము ఇంటికి వచ్చి " అయ్యో! నేనెంతటి పాపమునకు ఒడిగట్టితిని? అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్లగొట్టి క్షణమైన కామవాంఛకు లోనై మహాపరాధము చేసితిని" అని పశ్చాత్తాపమొంది, ఒక కూలివానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదకి తీసుకురావలసినదిగా పంపెను. కొన్ని దినముల గడిచిన తరువాత భర్త ఇంటికిరాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంవి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను.
కొంతకాలనికి శివార్చకునికి ఏదో వ్యాధి. సంక్రమించి దినదినము క్షీణిస్తు మరణించెను. అతడు రౌరవాది నరక కూపములబడి నానాబాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తనికి కుమారుడై కార్తీక మాసంలో నదీస్నానము చేసి దేవాతదర్శనము చేసి ఉండటంవలన నేడు జన్మముల పాపములు నశించుటచేత అజామీళుడై పుట్టెను. ఇప్పటికి తన అవసానకాలమున " నారాయణా" అని శ్రీహరిని స్మరించటం వలన వైకుంఠనికి పోయెను.
బ్రాహ్మణుని భార్య అగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను ఆమె యమయాతనలు అనుభవించి ఒక మాల వాని ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రిగండమున పుట్టిందని చెప్పెను. మాలవాడు ఆ శిశువును తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారినపోతూ పిల్లయేడుపు విని జాలికలిగి తీసుకొనిపోయి తన ఇంట్లోని దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామీళుడు ప్రేమించెని. వారి పూర్వజన్మ వృత్తాంతము ఇదే.
నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దానధర్మలు, శ్రీహరికథలు ఆలకించటం, కార్తీకమాస స్నానప్రభావల వలన ఎటువంటి వారైన మోక్షము పొందగలరు. కావున కార్తీక మాసంలో వ్రతములు, పురాణ శ్రవణములు చేసినవారి ఇహపర సుఖములు పొందగలరు.

పదవరోజు పారాయణము సమాప్తము. 
◆◆◆◆◆◆◆◆◆◆◆
కార్తీక మాస పదవరోజు దానధర్మ జపతపాది విధులు - ఫలితాలు

పూజించాల్సిన దైవము → దిగ్గజాలు
జపించాల్సిన మంత్రము → ఓం మహామధేభాయ స్వాహా
నిషిద్ధములు → గుమ్మడికాయ, నూనె, ఉసిరి
దానములు → గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె
ఫలితము → యశస్సు, ధనలబ్ధి

సంబంధిత వర్గం
కార్తీకమాస విశేషం...పోలి స్వర్గానికి వెళ్ళుట
కార్తీకమాస విశేషం...పోలి స్వర్గానికి వెళ్ళుట

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.