(Local) Mon, 21 Oct, 2019

ప్రపంచంలో తొలి వైమానికుడు రావణ బ్రహ్మ....

August 01, 2019,   4:03 PM IST
Share on:
ప్రపంచంలో తొలి వైమానికుడు రావణ బ్రహ్మ....

ప్రపంచపు మొదటి విమానాన్ని కనిపెట్టింది ఎవరు అనగానే ఠక్కున రైట్ సోదరుల అని సమాధానం వస్తుంది. కానీ అది నిజం కాదు... ప్రపంచపు మొట్ట మొదటి విమానాన్ని కనిపెట్టింది మన దేశానికి చెందిన శివకర్ బాపూజీ తల్పాడే. చరిత్ర ప్రకారం 1903 డిసెంబర్ 17 న రైట్ సోదరులు ప్రపంచపు మొదటి విమానాన్ని రూపొందించి ప్రయోగించారు. అయితే రైట్ సోదరులు తమ విమానాన్ని ప్రయోగించడానికి సుమారుగా ఎనిమిదేళ్ల ముందు 1895 లో మన భారతీయుడు శివకర్ బాపూజీ తల్పాడే ప్రపంచపు మొదటి విమానాన్ని రూపొదించాడు. శివకర్ బాపూజీ తల్పాడే ప్రాచీన సాంస్కృతిక గ్రంధాలలో పొందుపరిచిన వేద పరిజ్ఞానం ఆధారంగా మొదటి  విమానాన్ని రూపొదించారు.అంతేకాక భారీ జనసందోహం ముందు ముంబాయ్ లోని చౌపతి తీరంలో బాపూజీ తల్పాడే గారు మొదటి విమానాన్ని విజయవంతంగా నడిపి చూపారు. అయితే చరిత్రను ఆధారం చేసుకుని వివరించాల్సి వస్తే కనుక ఈ విశాల ప్రపంచంలో తొలి వైమానికుడు రావణ బ్రహ్మ మాత్రమేనని, 5,౦౦౦ సంవత్సరాలకు పూర్వమే ఆయన విమానంలో ప్రయాణించాడని శ్రీలంక ప్రభుత్వం విశ్వసిస్తోంది. అంతేకాదు, సింహళ దేశ రాజైన రావణాసురుడు ఆ కాలంలో విమానంలో ప్రయాణించేందుకు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశోధించే కార్యక్రమాన్ని కూడా శ్రీలంక ప్రభుత్వం చేపట్టింది. విమానాన్ని ఉపయోగించి ఆకాశమార్గంలో ప్రమాణించిన తొలి మానవుడు రావణాసురుడే అని నిరూపించడానికి తమ వద్ద తిరుగులేని ఆధారాలున్నాయని శ్రీలంక పౌర విమానయాన సంస్థ ఉపాధ్యక్షుడు శశి ధనతుంగె వాదిస్తున్నారు.

రావణ బ్రహ్మ మహా మేథావి. ఆకాశమార్గంలో ప్రయాణించిన తొలి వ్యక్తి ఆయనే. ఇది పౌరాణిక గాథ కాదు & వాస్తవం. ఈ విషయంపై సమగ్ర పరిశోధన అవసరం. రానున్న ఐదేళ్లలో దీన్ని నిరూపించి చూపిస్తాం అంటూ ఆయన బల్లగుద్ది చెబుతున్నారు. శ్రీలంకలోని అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం బండారు నాయకే ఉన్న కటునాయకేలో బుధవారం పౌర విమానయాన నిపుణులు, చరిత్రకారులు, పురావస్తు పరిశోధకులు, శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రజ్ఞులు కలసి సమావేశమై ఈ విషయమే చర్చించారు. 5,000 సంవత్సరాల క్రితం ఇప్పటి భారతదేశానికి శ్రీలంక రాజు రావణ చక్రవర్తి విమానంలో ప్రయాణించాడని ఈ సమావేశంలో వారంతా తేల్చేశారు.

అయితే సీతాదేవిని రావణాసురుడు అపహరించి లంకకు తెచ్చాడన్నది మాత్రం పచ్చి అబద్ధమని వారు స్పష్టం చేశారు. అదంతా భారతీయుల కల్పన అని, రావణాసురుడు ఎంతో ఉదాత్తుడైన రాజన్నది వారి వాదన. ఇటీవలి కాలంలో రావణాసురుడికి సంబంధించిన విశేషాలను సేకరించడంపై శ్రీలంక ప్రభుత్వం అమితాసక్తిని కనబరుస్తోంది. ఇటీవలే రావణ పేరిట ఒక ఉపగ్రహాన్ని కూడా అంతరిక్షంలోకి శ్రీలంక పంపించింది. రావణాసురుడు పరాక్రమవంతుడైన రాజే కాక మహా పండితుడని శ్రీలంకలో అత్యధికులు విశ్వసిస్తారు. కొన్ని భారతీయ పురాతన గ్రంథాలు కూడా రావణాసురుడిని మహా బ్రాహ్మణుడిగా అభివర్థించడం గమనార్హం.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.