(Local) Fri, 19 Jul, 2019

మే 17 నుండి 19వ తేదీ వరకు శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

May 09, 2019,   2:57 PM IST
Share on:

తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మే 17 నుండి 19వ తేదీ వరకు జరుగనున్న వార్షిక వసంతోత్సవాల పోస్టర్లను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం గురువారం టిటిడి పరిపాలనా భవనంలోని స‌మావేశ మందిరంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుచానూరులోని ప‌ద్మ‌స‌రోవ‌రంలో ఆవిర్భ‌వించిన శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన వసంతోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మే 14న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంద‌ని, మే 16న అంకురార్పణతో వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయ‌ని చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో వసంతోత్సవాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఉత్సవాల్లో భాగంగా మే 18వ తేదీన ఉదయం 7.11 గంట‌ల నుండి 11 గంట‌ల వ‌ర‌కు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. ఈ సందర్భంగా ఈ మూడు రోజులపాటు సాయంత్రం 2.30 నుండి 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వ‌హిస్తారు. గృహస్త భక్తులు(ఇద్ద‌రు) రూ.500/- చెల్లించి మూడు రోజుల‌పాటు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు అమ్మ‌వారి ద‌ర్శ‌నంతోపాటు ఒక లడ్డూ బహుమానంగా అందజేస్తారు.ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.