(Local) Thu, 05 Dec, 2019

ఘనంగా ఆలయాలలో నాగుల చవితి

October 31, 2019,   11:42 AM IST
Share on:
ఘనంగా ఆలయాలలో నాగుల చవితి

దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తిక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు. గురువారం నాగుల చవితి సందర్భంగా ప్రతి ఆలయాలలో నాగదేవతలను పూజించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ పూజిస్తూ వస్తున్నారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే...అందులో భాగంగానే ' నాగుపాము" ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం కలగకుండా చేస్తాయట. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో కథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేస్తారు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు, తేగలు నాగపూజకు చేసి నివేదన సమర్పిస్తారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.