(Local) Mon, 17 Jun, 2019

నేడు శ్రీరామ పట్టాభిషేకం

April 15, 2019,   12:06 PM IST
Share on:

ఆదివారం భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది భక్తులు స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. కుటుంబం తరపున వ్యక్తిగతంగా సీతారామచంద్రస్వామివారికి పట్టువస్ర్తాలను పంపించారు. ఈ పట్టువస్ర్తాలను దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ అందజేశారు. 

నేడు శ్రీరామ పట్టాభిషేకం

శ్రీసీతారాముల కల్యాణం ఆదివారం అత్యంత వైభవోపేతంగా జరుగగా.. అధికారులు సోమవారం నిర్వహించనున్న శ్రీరామపట్టాభిషేకంపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. పట్టాభిషేకం వేడుకను వీక్షించే భక్తులకు టికెట్లను విక్రయించింది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.