(Local) Tue, 21 May, 2019

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

May 06, 2019,   2:35 PM IST
Share on:

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే 11 నుంచి 19వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం ఆదివారం తిరుపతిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు మే 10న అంకురార్పణ జరుగనుంద‌న్నారు. తిరుపతి, పరిసర ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవాలకు విచ్చేసి వాహనసేవలను తిలకించాలని కోరారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహిస్తామన్నారు.

తేదీ ఉదయం సాయంత్రం

11-05-2019(శ‌నివారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం

12-05-2019(ఆదివారం) చిన్నశేష వాహనం హంస వాహనం

13-05-2019(సోమ‌వారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

14-05-2019(మంగ‌ళ‌వారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

15-05-2019(బుధ‌వారం) మోహినీ అవతారం గరుడ వాహనం

16-05-2019(గురువారం) హనుమంత వాహనం గజ వాహనం

17-05-2019(శుక్ర‌వారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

18-05-2019(శ‌నివారం) రథోత్సవం అశ్వవాహనం

19-05-2019(ఆదివారం) చక్రస్నానం ధ్వజావరోహణం.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి స్థానికాల‌యాల ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, శ్రీ‌నివాస వాఙ్మ‌య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి డా.. మేడ‌సాని మోహ‌న్‌, ఏఈవో శ్రీ ఉద‌య‌భాస్క‌ర్‌రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.