(Local) Sun, 08 Dec, 2019

విజయదశమి నాడు జమ్మి చెట్టు విశిష్టత

October 08, 2019,   10:50 AM IST
Share on:
విజయదశమి నాడు జమ్మి చెట్టు విశిష్టత

విజయదశమి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది జమ్మి చెట్టు. కానీ, జమ్మి చెట్టునే ఎందుకు పూజించాలి అనేది చాలా మందికి తెలియదు. అయితే, దీని వెనుక పురాణ కథలు చాలానే ఉన్నాయి. అలాగే, ఆయుర్వేధ రహస్యాలు ఉన్నాయి. జమ్మి చెట్టు అని పిలిచే శమీవృక్షం ప్రస్థావన రామాయణ, మహాభారతాల్లో మనకు కనిపిస్తుంది. అందుకే, శమీ శమయతే పాపం, శమీ శత్రువినాశినీ.. అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ!! అంటూ ప్రజలచే పూలజందుకుంటున్న మహిమాన్వతిమైన వృక్షం శమీవృక్షం. మరి ఆ వృక్ష మహిమలు ఇప్పుడు తెలుకుందాం.
త్రేతాయుగంలో ఆశ్వయుజ శుద్ధ దశమినాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత.. రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమినాడు విజయం సాధించాడని రామయణం చెబుతుంది. అదే విధంగా శమీ పూజ చేసేందుకు భారత కథ కూడా నిదర్శనమంటారు.ద్వాపర యుగంలో పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకుని.. ఏడాది అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద దాచిపెట్టి.. విరాటరాజు వద్ధ కొలువుకు వెళ్లారు. సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి ఆ ఆయుధాలు ధరించి అర్జుణుడు గోగ్రహణంలో కౌరవులపై విజయం సాధించాడు. జమ్మి చెట్టుకు పూజలు చేయడం వల్లే విజయం సిద్దించిందని.. వారి విజయాలకు ప్రతికగా విజయదశమినాడు జమ్మి చెట్టును పూజిస్తారు.అయితే, అవి పురాణాలు చెబుతున్న జమ్మీ చెట్టు కథలు. కానీ, అనేక వృక్ష సంతతుల మాదిరిగానే ఇది కూడా ఒక ఔషద విలువలు కలిగిన చెట్టు. ఆయుర్వేదంలో చర్మసంబంధ వ్యాధులకు మందుగా జమ్మిచెట్టు ఆకులు, బెరడు వినియోగిస్తారు. జమ్మి ఆకుల నుంచి పసరు తీసి పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. జమ్మిపూలను చెక్కరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించవచ్చు. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.