(Local) Mon, 21 Oct, 2019

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రత్యేకత ఏంటి?

June 07, 2019,   1:35 PM IST
Share on:
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రత్యేకత ఏంటి?

పరమశివుడికి సంబంధించిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క
ప్రత్యేకత వుంటుంది. కొంతమంది వీటిలో తమకిష్టమైన వాటిని ఎంచుకుని నిరంతరం వాటినే
పూజిస్తుంటారు. అలాగే ప్రతిఒక్కరూ రకరకాలుగా తమకు అనుగుణంగా వుండే విధంగా, తమకు
నచ్చిన సమయంలో పూజించుకుంటుంటారు. 
అయితే ఏ లింగాన్ని, ఎప్పుడు, ఎలా పూజించాలి...? వాటివల్ల వచ్చే నష్టాలేంటి,
లాభాలేంటి దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం....
ఏ లింగాన్ని ఎవరు పూజించాలి...?
లింగపురాణాల ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్నీ, శౌర్య ప్రధానులైన క్షత్రియులు
బాణలింగాన్నీ, వాణిజ్య ప్రధానలైన వైశ్యులు స్వర్ణలింగాన్నీ పూజించుకోవాలి.
అయితే స్ఫటికలింగాన్ని మాత్రం ఎవరైనా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా
పూజించుకోవచ్చు.
భర్తజీవించి వున్న స్త్రీలయితే స్ఫటిక లింగాన్ని, భర్తలేనివారు రసలింగాన్నికాని,
స్ఫటికలింగాన్ని గాని అర్చిస్తే ఎంతో మంచిదని లింగపురాణంలో పేర్కొనబడింది.
వాటివల్ల వచ్చే ఫలితం ఏమిటి...?
ఏ లింగాన్ని పూజిస్తే ఏ ఫలితం లభిస్తుందోనన్న విషయాలు లింగపురాణంలో వివరించి
వున్నాయి. అందులో రత్నాజ శివలింగాన్ని పూజించడం వల్ల ఐశ్వర్యంతోపాటు వైభవం
సిద్ధించి పరిపూర్ణత కలుగుతుంది. అలాగే ధాతుజలింగం భోగ విలాసాలను అందిస్తుంది.
మృత్తికాలింగం కూడా శిలా లింగంలాగానే పరిపూర్ణతనునిస్తుంది.
ఏది అతి పవిత్రమైన లింగం..?
శివునికి సంబంధించిన లింగాలలో అత్యంత పవిత్రమైన లింగం బాణలింగం. ఇవి తెల్లగా, చిన్న
అండాకారలంలో నదీప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి వుంటాయి. ఇది నర్మదా నదిలో
ఎక్కువగా లభిస్తుంది.
ఎప్పుడు పూజించుకోవాలి..?
వైశాఖంలో వజ్రలింగాన్ని, జ్యేష్ట౦లోమరకత లింగాన్ని, శ్రావణంలో నిలపు లింగాన్ని,
భాద్రపదంలో పద్మరాగ లింగాన్ని, ఆశ్వయుజంలో గోమేధికలింగాన్ని, కార్తికంలో
ప్రవాళలింగాన్ని, మార్గశిరంలో వైడూర్య లింగాన్ని, పుష్యమాసంలో పుష్పరాగ
లింగాన్ని, మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని, ఫాల్గుణ౦లో స్పటిక లింగాన్ని
పూజించాలి. వీటికి ప్రత్యామ్నాయంగా వెండి, రాగి లింగాలను కూడా పూజించవచ్చు. 
చివరగా.... లింగపూజ చేసుకునేవారు ఉత్తరముఖంగా కూర్చొని వుండాలి. అలాగే రుద్రాక్ష,
భస్మం, మారేడు అనే మూడువస్తువులు తమతోపాటు తప్పనిసరిగా పూజలో వుంచుకోవాలని
శివపురాణంలో చెప్పబడింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.