(Local) Mon, 16 Sep, 2019

ఏ నామాన్ని జపిస్తే ఏ ఫలితం వస్తుంది....

September 05, 2019,   6:03 PM IST
Views: 30
Share on:
ఏ నామాన్ని జపిస్తే ఏ ఫలితం వస్తుంది....

ప్రతి మనిషి దైనందిక జీవితంలో దైవ నామ స్మరణ అనేది చాల ప్రాముఖ్యత వహిస్తుంది. మన పెద్దలు ఎప్పటికప్పుడు చెబుతుంటారు నిత్యం భగవంతుడిని స్మరించడం వల్ల మానవుని కష్టాలు, బాధలు తొలిగిపోతాయని ఆ దైవాన్ని నమ్ముకుంటే ఏటువంటి బాధలు మన దరి చేరవని, సుఖ సంతోషాలతో జీవించవచ్చునని చెబుతుంటారు. ఏ నామాన్ని జపిస్తే ఏం లాభాం కలుగుతుందో వారు సూచిస్తారు కూడా....

ఏ నామాన్ని జపిస్తే ఏ ఫలితం వస్తుంది....

• శ్రీ రామ అని జపిస్తే జయం లభిస్తుంది.
• కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాదులు మటుమాయం అవుతాయి.
• దమోదరున్ని జపిస్తే బందముల నుంచి విముక్తి లబిస్తుంది.
• నారాయణ అని స్మరిస్తే సకల సర్వ గ్రహాల దోషాలు సమశిపోతాయి.
• మాధవా అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి.
• ఆచ్యుతా అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషదంగా పనిచేస్తుంది.
• నరసింహ అని స్మరిస్తే మీ శత్రువుల పై మీదే విజయం అవుతుంది, అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుచి విముక్తి కలుగుతుంది.
• గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది.
• శ్రీ లక్ష్మినారాయణ లను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కలకలాడుతుంది.
• సర్వేశ్వర అని స్మరిస్తే మనం చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది, విజయం కలుగుతుంది.
• జగన్నాతా అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది.
• కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలుగుతాయి.
• శివ శివ అని అని స్మరిస్తే సకలమూ దరిచేరుతాయి.

సంబంధిత వర్గం
ఆరోగ్యం, ఆహారంపై గ్రహాల ప్రభావం....
ఆరోగ్యం, ఆహారంపై గ్రహాల ప్రభావం....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.