
హిందూ సంప్రదాయం అనుసరించి సకల దేవతాగణములకు అధిపతి గణనాయకుడు అని చెబుతుంటారు. అటువంటి వినాయకుడిని తల్లి పార్వతి దేవి తన వంటికి రాసుకునే నలుగుపిండితో తయారుచేసి ప్రాణం పోసింది. ఇలాంటి విగ్నేశ్వరుడి కి బాలుడి మనస్తత్వం కలిగి ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు. అయితే వినాయకుడికి అటుకులు, బెల్లం, చెఱకు, కుడుములు, ఉండ్రాళ్లు ఇలా బొజ్జగణపయ్య ఇష్టపడే నైవేద్యాలు. వీటితోపాటు గుంజీలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. వినాయకుని ఎదుట గుంజీళ్లు తీయాలని పెద్దలు చెప్తారు. ఎందుకంటే అలా గుంజీళ్లు తీయడం వలన స్వామికి సంతోషం కలుగుతుందట. అలా సంతోషంతో మనకోర్కెలను త్వరగా తీర్చుతారని ప్రతీతి. ఈ గుంజీళ్లు తీయడం వెనుక ఒక పురాణ కథ ఉన్నది.
పూర్వం ఒకనాడు శ్రీ మహావిష్ణువు మేనల్లుడైన గణపతికి అనేక బహుమతులు తీసుకుని కైలాసానికి వెళ్లారట. ఆ బహుమతలన్నీ అల్లుడికి చూపిస్తూ తన సుదర్శన చక్రాన్ని ప్రక్కన పెట్టారట. విఘ్నేశ్వరుడు ఆ సుదర్శన చక్రాన్ని తొండంతో తీసుకుని చటుక్కున మ్రింగేశాడు. కాసేపటికి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ఏదిరా అని అడిగితే ఇంకెక్కడిది నేను మ్రింగేశాను అని సెలవిచ్చారు స్వామి. మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఎలా బయటకు తీయాలా అని ఆలోచించి చివరకు చెవులు రెండు పట్టుకుని గుంజీళ్లు తీయడం మొదలు పెట్టారట. అదిచూసి గణపతికి ఆనందం వేసి బిగ్గరగా నవ్వడం మొదలు పెట్టారు. ఈ నవ్వడంలో సుదర్శనచక్రం బయటకు వచ్చింది. అలా మొదట గణపతికి గుంజీళ్లు సమర్పించినది శ్రీమహావిష్ణువే!
అయితే ఈ గుంజిళ్ళు విషయంలో సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయని మరో నమ్మకం ఉంది. గుంజీలు తీయడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందట. ఇది మెదడుకు యోగా అని సైంటిస్ట్స్ చెబుతుంటారు. గుంజీళ్ళు తీసేటప్పుడు మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. సాధారణంగా మన నాసికంలోని రెండు రంధ్రాల నుండి ఒకేసారి గాలి పీల్చటం కాని వదలటం కానీ చేయం. ఏదో ఒక రంధ్రం మాత్రమే ఉపయోగిస్తాం. కనీసం మనకు అవగాహన కూడా ఉండదు. ఒకసారి కావాలంఏ మీ నాసికా రంధ్రాల దగ్గర చేతి వేలు ఉంచుకుని పరీక్షించండి. ఇది మీక అర్థం అవుతుంది. అయితే ఈ గుంజీళ్లు తీసిన తర్వాత నాసిక లోని రెండు రంధ్రాలు మన శ్వాస క్రియకు ఉపయోగపడడం మనం గమనించవచ్చు. అలాగే దీని వల్ల బరువు తగ్గడంతో పాటు, మానసిక సమస్యలు కూడా తగ్గుతాయట.
-
జప సాధన లో తలెత్తే కొన్ని సందేహాలు ...
29 Nov 2019, 7:08 PM
-
కార్తీకమాస విశేషం...పోలి స్వర్గానికి వెళ్ళుట
27 Nov 2019, 4:44 PM
-
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 30వ అధ్యాయం
27 Nov 2019, 4:01 PM
-
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 29వ అధ్యాయం
27 Nov 2019, 3:53 PM
-
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 28వ అధ్యాయం
25 Nov 2019, 11:39 AM
-
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 27వ అధ్యాయం
24 Nov 2019, 10:00 PM
-
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 26వ అధ్యాయం
23 Nov 2019, 11:30 PM
-
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 25వ అధ్యాయం
22 Nov 2019, 6:03 PM
-
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 24వ అధ్యాయం
21 Nov 2019, 11:55 PM
-
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 23వ అధ్యాయం
21 Nov 2019, 11:52 PM
-
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 22వ అధ్యాయం
20 Nov 2019, 5:07 PM
-
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 21వ అధ్యాయం
19 Nov 2019, 10:56 PM
-
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 20వ అధ్యాయం
19 Nov 2019, 10:46 PM
-
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 19వ అధ్యాయం
16 Nov 2019, 5:46 PM
-
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 18వ అధ్యాయం
15 Nov 2019, 5:52 PM
-
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 17వ అధ్యాయం
14 Nov 2019, 1:01 PM
-
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 16వ అధ్యాయం
13 Nov 2019, 3:16 PM
-
"కార్తిక పౌర్ణమి విశిష్టత"...
12 Nov 2019, 3:46 PM
-
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 15వ అధ్యాయం
12 Nov 2019, 12:11 PM
-
కార్తీకమాస విశేషం...కార్తీక పురాణం 14వ అధ్యాయం
12 Nov 2019, 12:04 PM

ముస్లిం దేశ కరెన్సీపై గణపయ్య
Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.