(Local) Wed, 16 Oct, 2019

డయల్‌ యువర్‌ సీఈవో...ఆరోగ్యశ్రీ

October 09, 2019,   3:26 PM IST
Share on:
డయల్‌ యువర్‌ సీఈవో...ఆరోగ్యశ్రీ

ఆంధ్రప్రదే సీఎం వైఎస్ జగన్ ఎన్నికలకి ముందు నవరత్నాలను మేనిఫెస్టోలో ప్రశేపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందులో భాగంగా డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరును తెలుసుకునేందుకు డయల్‌ యువర్‌ సీఈవో అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్‌ ఎ.మల్లిఖార్జున తెలిపారు. ప్రతి గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు డయల్‌ యువర్‌ సీఈవో కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా చేపట్టిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలకు సక్రమంగా అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. నిర్ణీత సమయంలో 0863–234166కు ఫోన్‌ చేసి సమస్యలు చెప్పవచ్చని మల్లిఖార్జున పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
సాయంత్రంలోపు బోటు వెలికి తీస్తాం
సాయంత్రంలోపు బోటు వెలికి తీస్తాం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.