(Local) Mon, 16 Sep, 2019

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై మండిపడిన కాంగ్రెస్

September 11, 2019,   3:27 PM IST
Views: 27
Share on:
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై మండిపడిన కాంగ్ర ...

దేశంలో ఆటో పరిశ్రమ కుంటుపడడానికి కారణమంటూ యువత పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. కేంద్రం తన తప్పును ఇతరులపైకి మోపుతోందే తప్ప దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి తన విధానాలే కారణమని మాత్రం చెప్పడం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యానించారు. వోటర్లను నిందిస్తున్నారే తప్ప దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దాలో తెలుసుకోలేకపోతున్నారని ఆయన నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

మోడీ టిట్టర్ ఫాలోవర్లు 5 కోట్ల మంది దాటారని, దేశ ఆర్థిక నిల్వలు 5 లక్షల కోట్లకు పెరుగుతాయని ప్రభుత్వం చెబుతోందని, అయితే అది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. యువజనులకు ఉద్యోగాలు దొరకడం లేదని, దీనికి కూడా ప్రతిపక్షమే కారణమని నిందిస్తారా అంటూ ఆయన నిలదీశారు. మంచి జరిగితే అది తమ ఘనతని, చెడు జరిగితే అది ఇతరులు చేసిందని ప్రభుత్వం చెప్పుకుంటోందని, మరి ప్రజలు మిమల్ని ఎందుకు ఎన్నుకున్నారని సింఘ్వీ ప్రశ్నించారు.

సంబంధిత వర్గం
ఒకే దేశం ఒకే భాషా ఉండకూడదు -జైరాంరమేష్‌
ఒకే దేశం ఒకే భాషా ఉండకూడదు -జైరాంరమేష్‌
కాంగ్రెస్‌ పార్టీకి ఊర్మిళ రాజీనామా
కాంగ్రెస్‌ పార్టీకి ఊర్మిళ రాజీనామా

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.