(Local) Thu, 28 May, 2020

మరికాసేపట్లో ప్రారంభంకానున్న అఖిలపక్ష సమావేశం...

September 16, 2019,   3:13 PM IST
Share on:
మరికాసేపట్లో ప్రారంభంకానున్న అఖిలపక్ష సమావేశం...

నల్లమలలో యురేనియం మైనింగ్ పై గత కొన్ని రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా సోషల్ మీడియా వేదిక చేసుకుని ఒక ఉద్యమమే కొనసాగుతుంది. ఈ అంశంపై జనసేన అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్  కొన్ని రోజుల క్రితం స్పందించారు.

నల్లమల ను కాపాడాలంటూ గళం కలిపారు. ఇదే అంశంపై సీనియర్ కాంగ్రెస్ నేత హనుమంతు రావు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసి మద్దతు కోరిన విషయం తెలిసిందే! నల్లమలను కాపాడడానికి జనసేన పార్టీ ముందుకు కదిలింది. తెలుగు రాష్ట్రాల్లో గల అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. హైదరాబాద్  హోటల్ దస్పల్లా ఇందుకు వేదిక అయ్యింది. మరికొంత సమయంలో ప్రారంభం కానున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి జనసేన అధినేత తో పాటుగా నాదెండ్ల మనోహర్ , వి.హనుమంతు రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఒవైసి, కోదండరాం, గోపాల గౌడ  మరికొంతమంది హాజరుకానున్నారు. 

సంబంధిత వర్గం
ఆర్టీసి నిర్వహణను భరించలేమని స్పష్టం చేసిన కేంద్రం
ఆర్టీసి నిర్వహణను భరించలేమని స్పష్టం చేసిన కేంద్రం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.