(Local) Mon, 20 Sep, 2021

జియో నుండి మరో ఫోన్ విడుదల

August 12, 2019,   11:54 AM IST
Share on:
జియో నుండి మరో ఫోన్ విడుదల

రిలయన్స్ ఇండస్ట్రీ 42వ వార్షిక సమావేశం సోమవారం ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ సంస్థ వివరాలు వెల్లడించడంతో పాటు పలు కీలక ప్రకటనలు చేశారు. “న్యూ ఇండియా న్యూ రిలయన్స్” నినాదంతో ముందుకు పోతున్నామని ముఖేష్ అంబానీ అన్నారు. “కమర్షియల్ గా బ్రాడ్ బ్యాంగ్  జియో గిగా ఫైబర్” సేవలను లాంచ్  చేశారు. అలాగే “రిలయన్స్ జియో ఫోన్ త్రీ” ని కూడా ముఖేష్ అంబానీ విడుదల చేశారు. భారత ఆర్ధిక వ్యవస్థలో రిలయన్స్ కీలక పాత్ర పోషిస్తుందని, 2030 నాటికి భారత ఆర్ధిక వ్యవస్థ టెన్ ట్రిలియన్ వ్యవస్థగా మారబోతుందన్నారు. 340 మిలియన్ల వినియోగదారులను రిలయన్స్ దాటిందన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారి రిలయన్స్ ఎక్కువగా విదేశీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. రిటేల్ రంగంలో లక్ష 30 వేల కోట్ల వ్యాపారం చేశామని అన్నారు.  ఇదంతా వినియోగదారుల ద్వారానే సాధ్యమైందని, వారందరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. భారత ప్రభుత్వానికి కూడా ముఖేష్ అంబానీ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వర్గం
ఫోర్బ్స్‌ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
ఫోర్బ్స్‌ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.