(Local) Fri, 23 Aug, 2019

‘భారతీయుడు 2’ సెట్ లో రకుల్ ప్రీత్

August 13, 2019,   5:52 PM IST
Share on:

టాలీవుడ్ లో ఈ మధ్య బాగా బిజీగా వున్న హీరోయిన్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.  లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న  ‘భారతీయుడు 2’ చిత్ర షెడ్యూల్ లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా జాయిన్ అయింది.  ఈ సినిమాలో కమల్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. సిద్ధార్థ్ కు జోడీగా రకుల్ ప్రీత్ నటిస్తోంది.  చెన్నైలో రకుల్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొందట.  ఆ విషయం వెల్లడిస్తూ రకుల్ సోషల్ మీడియాలో ఫస్ట్ డే వీడియోను పోస్ట్ చేసింది. ఈ అప్డేట్ తో ‘భారతీయుడు 2’ చిత్రం మళ్ళీ పట్టాలెక్కిన విషయం అందరికీ కన్ఫర్మ్  అయింది.  ఇప్పటికే పలు కారణాల వల్ల  ఈ షూటింగ్ డిలే అయింది కానీ ఈసారి ఎలాంటి ఆలస్యం లేకుండా  సినిమా షూటింగ్ ను చకచకా పూర్తి చేసేందుకు దర్శకుడు శంకర్ ప్లాన్ చేసుకున్నాడట.  వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 

సంబంధిత వర్గం

60 ఏళ్ళ సినీ ప్రస్థానంలో... విలక్షణ నటుడు
బెల్లీ డాన్స్ నేర్చుకుంటున్న అందాల భామ....!

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.