(Local) Wed, 16 Oct, 2019

కండల వీరుడి షోపై వివాదం....

October 09, 2019,   4:53 PM IST
Share on:
కండల వీరుడి షోపై వివాదం....

బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. దాదాపు ఏడు భాషల్లో బుల్లితెరపై ప్రసారమవుతున్న ఈ బిగ్ బాస్ కార్యక్రమం మీద వివాదాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ రియాలిటీ షో పై ఎన్ని వివాదాలు తెరలేచిన ఈ ప్రోగ్రాం మాత్రం నిరంతరాయంగా ప్రసారమవుతూనే ఉంది. తాజాగా హిందీ బిగ్ బాస్ షో పై దుమారం రేగుతోంది. అశ్లీలం శ్రుతిమించిందని ఆరోపిస్తూ హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 13ను నిషేధించాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) కేంద్ర సమాచార ప్రసార మంత్రి ప్రకాష్‌ జవదేఖర్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేసింది. ఓ ప్రైవేట్‌ ఛానల్‌లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ కార్యక్రమం కుటుంబంలో అందరితో కలిసి చూసేందుకు అభ్యంతరకరంగా ఉందని అశ్లీల ధోరణిలో సాగుతోందని సీఏఐటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రియాలిటీ షో మన పురాతన సాంస్కృతిక, సంప్రదాయాలను మంటగలిపేలా ఉందని మండిపడింది. టీఆర్‌పీ, లాభాల వేట కోసం విలువలను గాలికొదిలేసే విధానాన్ని భారత్‌ వంటి భిన్న సంస్కృతులకు నిలయమైన దేశంలో అనుమతించరాదని కోరింది. బిగ్‌బాస్‌ కాన్సెప్ట్‌ తీవ్ర అభ్యంతరకరమని, టెలివిజన్‌ ప్రపంచంలో నైతిక విలువలకు ఇది పూర్తి విరుద్ధమని పేర్కొంది. ఈ షో ప్రైమ్‌టైమ్‌లో ప్రసారమవతుందన్న ఇంగితం నిర్వాహకులకు లేకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. బిగ్‌బాస్‌ షో అన్ని విలువలకు తిలోదకాలిచ్చిందని దుయ్యబట్టింది.

సంబంధిత వర్గం
హీరోయిన్‌పై అరెస్ట్ వారెంట్...
హీరోయిన్‌పై అరెస్ట్ వారెంట్...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.