(Local) Thu, 28 May, 2020

శిల్ప ఔట్ !

September 16, 2019,   3:07 PM IST
Share on:
శిల్ప ఔట్ !

బుల్లితెరపై అలరించే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో రెండు సీజన్ పూర్తి చేసుకొని మూడో సీజన్ ప్రసారమవుతోంది. వారం మొత్తం ప్రసారమయ్యే ఈ తెలుగు బిగ్ బాస్ సీజన్ 3కి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ బిగ్ బాస్ షో కి ఎప్పుడు వైల్డ్‌కార్డ్ ఉంటుందని తెలిసిన సంగతే. అయితే బిగ్‌బాస్ సీజన్ 3కి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కలిసివచ్చేలా కనిపించటంలేదు.  తొలి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి వచ్చిన రెండు వారాలకే ఇంటినుంచి బయటకు వచ్చేసింది. వున్న ఆ రెండు వారాలు హౌస్‌లో తమన్నా కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. రవిని ప్రేమిస్తున్నానని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఆమె ఇంట్లో చాలా ఓవరాక్షన్ చేస్తోందని బిగ్‌బాస్ అభిమానులు కామెంట్లు చేశారు. ఈక్రమంలోనే ఆమెకు ఓటింగ్ శాతం తక్కువ అయిందని భావిస్తున్నారు. ఆమె వెళ్లిపోయాక వైల్డ్‌కార్డ్ రెండవ ఎంట్రీగా నటి, సీనియర్ యాంకర్ శిల్పా చక్రవర్తి ఎంట్రీ ఇచ్చింది. 

ఆమె ఇంట్లోకి రావడమే అందరి రహస్యాలు తన గుప్పిటలో పెట్టుకుంది. తొలుత ఆమె చీకట్లో కనిపించినప్పుడు ఇద్దరేసి ఎలిమినేట్ చేస్తున్న వ్యక్తుల పేర్లు, అందుకు గల కారణాలను ఆమె ముందు చెప్పారు. ఆ తర్వాత ఆమె ఇంట్లోకి వచ్చింది. దీంతో హౌజ్‌మేట్స్ అందరి ముఖాల్లో రంగులు మారాయి. ఎలిమినేషన్ ప్రక్రియ గురించి బిగ్‌బాస్ ముందు చెబితే ఎలాంటి సమస్య వుండదు. కానీ, కంటెస్టెంట్ ముందే గుట్టు చెప్పడంతో అందరూ అభద్రతా భావానికి లోనయ్యారు. వారు ఊహించింది ఏదీ జరగలేదు. 

అయితే శిల్పా చక్రవర్తి ఎంతో హుషారైన యాంకర్. ఆమె బిగ్‌బాస్‌ను కూడా అదే స్థాయిలో హుషారెత్తిస్తుందని బిగ్‌బాస్ భావించారు. కానీ, ఆమె వున్న ఆ రెండు వారాలు ఇంట్లో శరీరం, మనసంతా ఆమె ఇంటి మీదే వుంచినట్టు వుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలా వచ్చి అలా వెళ్లినంత పనే అయింది ఆమె విషయంలోనూ. కాకపోతే తమన్నాలా శిల్ప ఎలాంటి వివాదాల జోలికి వెళ్లలేదు. అందరితో కలవలేకపోతోందని ఇంటి సభ్యులు ఆమెపై ఆరోపణలు చేశారు. అందరితో మెల్లిగా కలుస్తానని శిల్ప అంది. కానీ అనూహ్యంగా ఈ ఆదివారం శిల్ప ఎలిమినేట్ అయి ఇంటినుంచి బయటకు వచ్చింది. 

ఇప్పుడిప్పుడే అందరితో కలుస్తున్నాను.. ఇంకొంత సమయం తనకు ఇచ్చి వుంటే బాగా కలిసిపోయేదాన్నని శిల్ప అంది. అయితే ఆమె నాగార్జున వద్దకు వచ్చాక మిగతా కంటెస్టెంట్లపై తన కామెంట్ చెప్పాలి. అప్పుడామె చాలా హుందాగా వ్యవహరించింది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయినవారందరూ ఏదైనా ముఖం మీదే చెప్పేశారు. నువ్వు ఇలా.. నువ్వు అలా అని. కానీ, శిల్ప విమర్శించినా అది వ్యక్తిగతంగానే అన్నట్టు చాల సున్నితంగా, ఎవరినీ నొప్పించకుండా ఆరోపణలు చేసింది. దీంతో ఇంట్లో సభ్యులు అందరు శిల్పను ప్రత్యేకంగా చూశారు. ఏది ఏమైనప్పటికీ బిగ్‌బాస్ ఇంటికి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కలిసివచ్చేలా లేదు. మధ్యలో వచ్చినవాళ్లు మధ్యలోనే పోతారు అన్న చందంగా సాగుతోంది. మరి ఈవారం వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఎవరు ఇస్తారోనని హాట్‌స్టార్‌లో విరివిగా కామెంట్లు వినిపిస్తున్నాయి.

సంబంధిత వర్గం
పున్నుని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌
పున్నుని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.