(Local) Mon, 09 Dec, 2019

డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి

November 30, 2019,   3:34 PM IST
Share on:
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి

తెలంగాణ బీజేపీ సీనియర్‌ నాయకుడు, ఉప్పర్‌పల్లి నివాసి గోల్కొండ సురేందర్‌రెడ్డి డెంగీతో శుక్రవారం యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరణించారు. తెల్ల రక్తకణాలు తగ్గిపోవడంతో ఆయనను అత్తాపూర్‌లో గల ప్రైవేటు ఆస్పత్రిలో మొదట చికిత్స కోసం చేర్పించారు. అయితే సురేందర్‌రెడ్డి పరిస్థితి విషమించడంతో యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. అయినా ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు చికిత్స పొందుతు మరణించాడు. ఆయన మరణవార్త తెలసుకున్న వివిధ పార్టీల నాయకులు ఉప్పర్‌పల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. సురేందర్‌రెడ్డి బీజేపీ కరసేవలో పాల్గొన్నారని అనంతరం పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారని యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి బొక్క బాల్‌రెడ్డి తెలిపారు.

 

దీంతో ఆయన మృతదేహం పై బీజేపీ జెండా కప్పి నివాళులర్పించడం జరిగిందన్నారు.సురేందర్‌రెడ్డికి నివాళులర్పించిన వారిలో టీడీపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామ భూపాల్‌రెడ్డి, సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింగ్‌రావు, బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శ్రీధర్‌, ప్రత్యేక ఆహ్వానితులు నారగూడెం మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పోరెడ్డి ధర్మారెడ్డి, సామ ఇంద్రపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సురేందర్‌రెడ్డి అంత్యక్రియలు ఉప్పర్‌పల్లిలో శుక్రవారం జరిగాయి.

సంబంధిత వర్గం
మహేష్ బాబు ను కలిసిన సైరా దర్శకుడు
మహేష్ బాబు ను కలిసిన సైరా దర్శకుడు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.