(Local) Tue, 18 Feb, 2020

చెన్నై వేదికగా భారత్- చైనా సమ్మిట్

October 09, 2019,   5:41 PM IST
Share on:
చెన్నై వేదికగా భారత్- చైనా సమ్మిట్

భారత్- చైనా దేశాల రెండవ అనధికార సమ్మిట్ ఈ నెల 11, 12 తేదీల్లో చెన్నైలో జరగనుంది. భారత ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జింపింగ్ తో సమావేశం కానున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల గురించి ఈ చర్చలు జరగనున్నాయి. గత ఏప్రిల్ లో మొదటి సమ్మిట్ చైనాలోని వుహాన్ లో జరిగింది. దీనికి సంబంధించి భారత్- చైనాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. ఈ నెల 11, 12న జరిగే రెండవ అనధికారిక సదస్సులో పాల్గొననున్నారు. చెన్నైలో జరగబోయే అనధికారిక సదస్సులో ప్రధానిమోదీతో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కలవనున్నారు. ఈ సదస్సులో ద్వైపాక్షిక అంశాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపై ఇరు దేశాల ఆలోచనలను, సహకారాన్ని గురించి చర్చించనున్నారు’’ అని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అయితే జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్- పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సమయంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చల ద్వారా భారత్- పాక్ లు సమస్యను పరిష్కరించుకోవాలని చైనా సూచించింది. మరోవైపు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో భేటీ కానున్నారు.

సంబంధిత వర్గం
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.