(Local) Mon, 21 Oct, 2019

 యో-యో స్కోరును పెంచే యోచనలో రవి శాస్త్రి

September 11, 2019,   4:42 PM IST
Share on:
 యో-యో స్కోరును పెంచే యోచనలో రవి శాస్త్రి

ఆంత్రజాతీయంగా ఆమోదించబడిన యో-యో టెస్టును ఆటగాడి ఫిట్‌నెస్‌ను కొలవడానికి ఒక మార్గంగా పరిగణించడం జరుగుతోంది .ఇందులో భాగంగానే టీమిండియా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. టీమిండియా ప్రధాన కోచ్‌  రవిశాస్త్రి దక్షిణాఫ్రికా సిరీస్‌తో ఫిట్‌నెస్‌ విషయంలో ఆటగాళ్లు మరింత శ్రద్ధపెట్టాలని యో-యో లో మార్పులు చేయనున్నాడు.ప్రస్తుతం ఉన్న యోయో టెస్టు  స్కోరును 17కు పెంచాలని శాస్త్రి భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే బీసీసీఐ, ఆటగాళ్లతో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నాడట.

సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా సిరీస్‌తోనే ఈ నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. గురువారం ఆటగాళ్లు, కోచ్, సహాయ సిబ్బంది అందరూ ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

వెస్టిండీస్ పర్యటన అనంతరం సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. సెప్టెంబర్ 15 నుంచి 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరుజట్లు పాల్గొంటాయి. సెప్టెంబర్ 15న ధర్మశాలలో తొలి టీ20, 18న మొహాలిలో రెండవ టీ20, 22న బెంగళూరులో మూడవ టీ20 జరగనుంది. అనంతరం 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఉంది. ఇందులో తొలి టెస్ట్ వైజాగ్‌లోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో అక్టోబరు 2 నుంచి ప్రారంభం కానుంది.

సంబంధిత వర్గం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.