(Local) Wed, 16 Oct, 2019

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఆగ్రహం

October 09, 2019,   2:13 PM IST
Share on:
సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఆగ్రహం

తెలంగాణ ఆర్టీసి కార్మికుల పై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పై తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసిలో కేవలం 1200 మంది మాత్రమే సిబ్బంది అని కేసీఆర్ తేల్చి చెప్పడం పై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్దంగా నోటిసు ఇచ్చి సమ్మెకు దిగిన కార్మికులపై సీఎం చేసిన ప్రకటన సరిగా లేదన్నారు. నోటిసులు ఇచ్చి సమ్మె చేసిన కార్మికులను తొలగిస్తానని కేసీఆర్ అన్నారని.. మరి ఆరేళ్లుగా సచివాలయానికి రాని సీఎం పైన పీడీ యాక్ట్ ప్రయోగించి.. అండమాన్ జైల్లో పెట్టాలా? అని ఆయన ఫైర్ అయ్యారు. తాము ఆ పని కూడా చేస్తామన్నారు. అలా చేస్తే కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. విచారణకు వచ్చే కేసుల గురించి మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ కు కార్మికులతో చర్చించేందుకు సమయం లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

సంబంధిత వర్గం
తెలంగాణాకు 79..,ఆంధ్రాకు 69 .346
తెలంగాణాకు 79..,ఆంధ్రాకు 69 .346

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.