(Local) Thu, 04 Jun, 2020

డామిట్ కథ అడ్డం తిరిగింది

May 15, 2019,   2:31 PM IST
Share on:
డామిట్ కథ అడ్డం తిరిగింది

కేంద్రంలో కాంగ్రేస్, బీజేపీయేత‌ర పార్టీని కేంద్రంలో ఏర్పాటు చేయాల‌ని, అందుకు దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల‌ను ఏకం చేసి కొత్త‌గా మూడో ఫ్రంట్ ని తెర‌మీదికి తీసుకురావాల‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు చేసిన, చేస్తున్న ప్ర‌య‌త్నాలు అంతా ఇంతా కాదు. ఇప్ప‌టికే మొద‌టి ద‌శ‌లో కేర‌ళ‌, త‌మిళ‌నాడు, కార్నాట‌క‌,ఒడిస్సా,ప‌శ్చిమ బెంగాల్, ఉత్త‌ర ప్ర‌దేశ్ తో స‌హా ఢిల్లీలో అనేక ప్రాంతీయ పార్టీల‌తో స‌మావేశ‌మై చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇకపోతే గులాబీ బాస్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ని ద‌గ్గ‌రుండి గ‌మ‌నించిన ఆయ‌న త‌న‌యుడు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ ఒక అడుగు ముందుకేసి లోక్‌సభ ఎన్నికల్లో సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు.. అనే నినాదంతో ముందుకెళ్లాలని టీఆర్ఎస్ శ్రేణుల‌కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే అలా మాట్లాడిన వారి నోట... డామిట్ కథ అడ్డం తిరిగింది అనే డైలాగ్  వినిపిస్తోంది. 

రెట్టించిన ఉత్సాహంతో... 

2018లో తెలంగాణ శాస‌న స‌భ‌కు జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భారీ విజ‌య ఢంకా మోగించి తిరుగులేని అధికారాన్ని కైవ‌సం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ ఓవైపు రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం లేకుండా చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేసుకుంటు ఆక‌ర్ష పేరుతో కాంగ్రేస్ పార్టీనుండి గెలిచిన ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసుకుంటూ.. ఇక త‌మ‌కు తిరుగులేద‌ని భావించిన కేసీఆర్ ఇక్క‌డ తెలంగాణ ప‌దిలం అనుకుని, ఢిల్లీపై క‌న్నేశాడు. దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల‌ను జ‌త‌క‌ట్టించే ప్ర‌య‌త్నం చేశాడు. అందులో బాగంగా మందీ మార్బ‌లంతో వెంటేసుకుని ప‌లు రాష్ట్రాలు తిరిగిన కేసీఆర్ తాజాగా రెంద‌వ ద‌ఫా ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.

ప‌ప్పులుడ‌క‌డం లేదు 

ప్ర‌త్యేక తెలంగాణ పేరుతో రాష్ట్రంలో ప‌లు ఉద్య‌మాలు చేసి ఎంతో మంది విధ్యార్ధుల ఆత్మ బ‌లిదానాలు చేసుకుంటున్న తీరును చూసి అప్ప‌టి యూపీఏ చైర్ ప‌ర్స‌న్, కాంగ్రేస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ, ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ తో క‌లిసి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన బీజేపీతో చ‌ర్చ‌లు జ‌రిపి రాష్ట్రంలోని ప్ర‌ధాన ప్రార్టీల అనుమ‌తితో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర విభజన చేశారు. అయితే ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకున్న కేసీఆర్, ఆ విధంగానే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేద్దామనుకున్న కల్వకుంట్ల కుటుంబం కలలు కల్లలుగా మిగిలిపోయాయి. మూడు నెలలుగా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో చేస్తున్న ప్ర‌య‌త్నాలు బెడిసి కొడుతున్నాయి.   ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని వైసీపీ అధినేత జగన్ ను బుట్టలో వేసుకున్న విధంగానే,  స్టాలిన్ ను కూడా బురిడీ కొట్టించాలని కేసీఆర్ గజకర్ణ, గోకర్ణ విద్యలను ప్రదర్శించారు. కానీ ఆ పప్పులు తమిళనాట ఉడకలేదు. 

ఫెడరల్ ఫ్రంట్ ఇక అనుమాన‌మే...?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో చేస్తున్న ప్ర‌య‌త్నాలకు గండి ప‌డిన‌ట్టేన‌ని ప‌లువురు నేత‌లు అనుకుంటున్నారు. కాంగ్రెస్,బీజేపీల‌కు ప్రత్యామ్నాయ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తానని తెలిపిన‌ గులాబీ బాస్ వెంట క‌ల‌సిరాని ప‌రిస్థితి. ఎందుకంటే గ‌తంలో ఒడిస్సా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ ని క‌లిసి ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఒక రాష్ట్ర సీఎం హోదాలో వ‌చ్చిన కేసీఆర్ కి ఆయ‌న ఘ‌ణ‌స్వాగ‌తం ప‌లికారు. కాని కేసీఆర్ తిరిగి వెళ్ళిన వెంట‌నే ఏపీ సీఎం చంద్ర‌బాబు వద్ద‌కు త‌న ఎంపీని పంపి తాము ఫెడరల్ ఫ్రంట్ లో చేర‌డంలేద‌ని స్ప‌స్ఠం చేశారు. తాజాగా త‌మిళ‌నాడులోని డీఎంకే ఛీఫ్ స్టాలిన్ ను క‌లవ‌డానికి వెళ్లిన కేసీఆర్ కు మొహంమీద‌నే చెప్పేశాడు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయేలోనే డీఎంకే కొనసాగుతుందని, ఫెడరల్ ఫ్రంట్ అనేది కుద‌ర‌ని ప‌ని వీల‌యితే మీరు యూపీయేలోనే కొన‌సాగాలాని కోరిన‌ట్టు స‌మాచారం. స్టాలిన్ అంత‌టి ఆగ‌క డీఎంకే సీనియ‌ర్ నేత దురైమురుగ‌న్ ని ఏపీ సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద‌కు పంపించి మీము యూపీయేతోనే ఉంటామ‌ని తేల్చి చెప్పారు. ఇక ప‌శ్చిమ బెంగాల్ సంద‌ర్శ‌న‌లో బాగంగా తృణ‌మూల్ కాంగ్రేస్ అధినేత్రి మాయావ‌తి ఏ హామీ ఇవ్వ‌లేదు. యూపీలో ఇప్ప‌టికే లోపాయ‌కార ఒప్పందంలో బాగంగా స‌మాజ్ వాదీ పార్టీ కాంగ్రేస్ కి అనుకూలంగానే వుంది. అమ్ ఆద్మీ పార్టీ కూడా పార్ల‌మెంట్ ఎన్నికల్లో కాంగ్రేస్ తో జ‌త క‌ట్టాల‌ని భావించింది. కాని అనుకోని కార‌ణాల‌తో జ‌త‌క‌ట్ట‌లేక‌పోయింది. కాని ఎలాగూ కేంద్రంలో కాంగ్రేస్ ఆపార్టీ మ‌ద్ద‌తు తెలిపే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి. ఎందుకంటే కేంద్రంలోని బీజేపీకి అమ్ ఆద్మీ పార్టీ ప‌చ్చ‌గడ్డి వేస్తే భ‌గ్గుమనేంత శ‌తృత్వం ఉంది. ఇక‌పోతే మ‌హారాష్ట్ర‌లో శివ‌సేనా ఎలాగూ బీజేపీకే స‌పోర్టు చేస్తుంది. మిగిలింది నేష‌న‌ల్ కాంగ్రేస్ పార్టీ. ఆపార్టీ అధ్య‌క్షుడు శ‌ర‌ద్ యాద‌వ్ కాంగ్రేస్ మిత్ర‌ప‌క్ష‌మే ఇక మిగిలింది క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాలు, ఇందులో క‌ర్నాట‌క‌లో ఇప్ప‌టికే జేడీఎస్, కాంగ్రేస్ పార్టీలు సంకీర్ణ ప్ర‌భుత్వ‌మే. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ ఎలా ఏర్పుడుతుంద‌ని, కేసీఆర్ కలలు కల్లలుగా మిగిలిపోతాయ‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు.
 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.