(Local) Fri, 15 Nov, 2019

ఏపి టిడిపికి మరో షాక్...బిజెపి తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి

October 21, 2019,   1:24 PM IST
Share on:
ఏపి టిడిపికి మరో షాక్...బిజెపి తీర్థం పుచ్చుకున్న  ...

ఏపిలో టిడిపికి మరో షాక్ తగిలింది. కడప జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి టిడిపికి గుడ్ బై చెప్పి, బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఢిల్లీలో ఈ ఉదయం ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డిని బిజెపిలోకి జేపీ నడ్డా సాదరంగా ఆహ్వానించారు. 2019 ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత టీడీపీతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. గత కొంత కాలంగా బిజెపిలో ఆది చేరబోతున్నారనే ప్రచారం జోరుగానే సాగింది. గతంలో కూడా ఆయన ఒకసారి ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఆదినారాయణరెడ్డి చేరికతో కడప జిల్లాలో బిజెపి ఎంత మేరకు పుంజుకుంటుందో వేచి చూడాలి.

సంబంధిత వర్గం
హెచ్‌టీటీ-40 విమానయానం అద్భుతం
హెచ్‌టీటీ-40 విమానయానం అద్భుతం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.