(Local) Mon, 16 Sep, 2019

శాసనమండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా

September 11, 2019,   2:04 PM IST
Views: 21
Share on:
Gutta Took Over As Legislative Council Chairman

తెలంగాణ శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.  గుత్తా సుఖేందర్‌ రెడ్డిని చైర్మన్‌ చైర్‌ వద్దకు మంత్రులు హరీష్‌ రావు, కెటిఆర్‌, ప్రశాంత్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు విపక్ష సభ్యులు తీసుకెళ్లారు. మండలి చైర్మన్ గా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డిని వారు అభినందించి , శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా కెటిఆర్  మీడియాతో మాట్లాడారు.  మా వయసు కన్న ఎక్కువ రాజకీయ అనుభవం కల్గిన వ్యక్తి గుత్తా అని మంత్రి కేటీఆర్  పొగిడారు. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన  వ్యక్తి అని ప్రశంసించారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యపై పోరాడిన నాయకులు గుత్తా అని కేటీఆర్ కొనియాడారు. 

సంబంధిత వర్గం
ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ -  ...
ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ - ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.