(Local) Thu, 18 Jul, 2019

నేను పెళ్ళయాక కూడా నటిస్తూనే ఉంటా -శృతి హాసన్

May 15, 2019,   1:09 PM IST
Share on:

 తాజాగా శృతిహాసన్  ఇండస్ట్రీలోని హీరోయిన్‌ల పరిస్థితిపై గళమెత్తింది. సినిమా హిట్ అయితే క్రెడిట్ అంతా హీరోలకే కట్టబెట్టడం తగదని విమర్శించిన శృతి… తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆదరణ పెరుగుతుండటం స్వాగతించదగ్గ పరిణామంగా పేర్కొంది. ఇక పెళ్లయిన హీరోయిన్‌లు సినిమాలకు దూరమవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. అలాగే తన విషయంలో అలా జరగదని శృతిహాసన్ పేర్కొనడం విశేషం. “హీరోయిన్‌లు పెళ్లయ్యాక భర్తకు ఇష్టం లేదనో, అత్తగారు వద్దన్నారోనని సినిమాలకు దూరమవడం దారుణమైన విషయం. యాక్టింగ్‌ను కూడా ఇతర ఉద్యోగాల్లాగే చూడాలి. నేను మాత్రం పెళ్లయి పిల్లలు పుట్టాక కూడా నటిస్తూనే ఉంటా. నటన అంటే నాకెంతో ఇష్టం”అని శృతిహాసన్ పేర్కొంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.