(Local) Wed, 23 Oct, 2019

వాయుసేనకు అత్యంత శక్తివంతమైన చినూక్ హెలీకాప్టర్లు

July 11, 2019,   11:04 PM IST
Share on:
వాయుసేనకు  అత్యంత శక్తివంతమైన చినూక్ హెలీకాప్టర్లు

మన దేశానికి  అత్యంత శక్తివంతమైన మరో రెండు చినూక్ హెలీకాప్టర్లు చేరాయి. రెండు రోజుల క్రితం బోయింగ్ సంస్థ వీటిని ఇండియన్ ఏయిర్ ఫోర్స్ కు అందించింది. ఇవి ప్రపంచంలోనే  అత్యంత శక్తివంతమైన హెవీ లిఫ్టుడ్ హెలీకాప్టర్లు, ఒక్కొక్క చినూక్ హెలీకాప్టర్ 45 మంది సైనికులతో సహా 10 టన్నుల పేలోడ్ ను తీసుకువెళ్ళగలవు.  కాగ చినూక్ హెలీకాప్టర్లకు దరిదాపులలొకి వచ్చే ఏటువంటి హెలీకాప్టర్ చైనా దగ్గర లేకపోవడం విశేషం. మొత్తంగా భారత్ 15 చినూక్ హెలీకాప్టర్లను అమెరికా నుండి కొనుగోలు చేస్తుంది.

ఒక పక్క టిబెట్‌.. అరుణాచల్‌ సరిహద్దుల్లో చైనా మోహరింపులు పెరిగిపోవడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. సంక్షోభ సమయంలో సరిహద్దులకు బలగాలను తరలించడం ప్రధాన సమస్యగా మారుతుందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో సరిహద్దులకు చేరేందుకు ఉన్న రవాణా మార్గాలను, సౌకర్యాలను వీలైనంత మెరుగు పర్చుకొనే పనిలో పడింది. ఈ క్రమంలో 2015లో భారత్‌ 15 చినూక్‌ హెలికాప్టర్లను అమెరికా నుంచి కొనుగోలు చేసింది.  

రెండు రొటేటర్లతో విభిన్నంగా  కనిపించే ఈ హెలికాప్టర్‌ చాలా శక్తిమంతమైంది. దాదాపు 10 టన్నులకు పైగా పేలోడ్‌ను ఇది తీసుకెళ్లగలదు. అంటే ఎం777 శతఘ్నులు, జీపులను  ఒక చోట నుంచి మరో చోటుకు తేలిగ్గా తరలించగలదు. సైనిక దళాలను వేగంగా పర్వతాలతో కూడిన సరిహద్దులకు చేర్చడానికి ఇటువంటి హెలికాప్టర్లు బాగా ఉపయోపడతాయి. 

ఎం777 శతఘ్నులను భారత సైన్యం చైనా సరిహద్దుల్లో మోహరించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి చినూక్‌ రాకతో మరింత బలం చేకూరింది. ఇంధన సరఫరా, సహాయ కార్యక్రమాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఇప్పటి భారత వాయుసేనలో రష్యా తయారు చేసిన ఎంఐ26 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇవి కూడా అత్యంత శక్తిమంతమైనవి. ఇప్పటి వరకు భారత్‌ వీటినే హిమాలయ ప్రాంతాల్లో వినియోగిస్తోంది. శక్తి పరంగా చూసుకుంటే చినూక్‌  కంటే వీటి ఇంజిన్లు చాలా పెద్దవి. కానీ ఇదే పెద్ద లోపంగా మారింది. ఈ హెలికాప్టర్లు ఇంధనాన్ని విపరీతంగా వాడుకొంటాయి. 

ఖాళీ ఎంఐ 26 హెలికాప్టర్‌ బరువు దాదాపు 28 టన్నులు.. అదే సమయంలో చినూక్‌ ఖాళీ హెలికాప్టర్‌ బరువు 10 టన్నులు. దీంతో చినూక్‌కు ఇంధన వినియోగం కూడా చాలా తగ్గుతుంది. ఎంఐ26హెలికాప్టర్ల శక్తిలో 15శాతం తోకభాగంలో  ఫ్యాన్‌ కారణంగా వృథా అవుతోంది. చినూక్‌లో ఈ సమస్యలేదు. అంతేకాకుండా ఎంఐ26 హెలికాప్టర్లు విడిభాగాల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. అందుకే భారత్‌ ప్రభుత్వం దీనివైపు మొగ్గు చూపింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.