(Local) Fri, 06 Dec, 2019

చిరు దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం

November 17, 2019,   11:52 PM IST
Share on:
చిరు దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం

టాలీవుడ్ కి మెగాస్టార్ ని అందించిన పునాదిరాళ్లు  దర్శకుడు రాజ్‌కుమార్‌కు దీనావస్థలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ మంచాన పడ్డారని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యూస్ పేపర్ లో వచ్చిన వార్తపై ప్రసాద్స్‌ క్రియేటివ్‌ మెంటర్స్‌ ఫిలిం మీడియా స్కూల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ సురేష్‌రెడ్డి స్పందించారు. తార్నాకలో ఉంటున్న రాజుకుమార్ దగ్గరకు వెళ్లి రూ.41వేలు అందజేశారు.  

అదే విధంగా మనం సైతం తరఫున నటుడు కాదంబరి కిరణ్‌కుమార్‌ రూ.25 వేల నగదు అందజేశారు. మనం సైతం కుటుంబం నుంచి సాయం చేద్దామని ఆయన గ్రూపులో అభ్యర్థించగానే పలువురు నటులు, సినీ జర్నలిస్టులు, సాంకేతిక నిపుణులు స్పందించారు. ఆ మొత్తాన్ని కాదంబరి కిరణ్‌ స్వయంగా వెళ్లి రాజ్‌కుమార్‌కు ఇచ్చారు. స్పందించిన ప్రతి ఒక్కరికీ రాజకుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంచానికి పరిమితమై వైద్యం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. సినిమా నిర్మాతగా, దర్శకుడిగా, గీత రచయితగా, కథా రచయితగా పని చేసినా ఇప్పటికీ ఫిల్మ్‌నగర్‌లో గానీ, చిత్రపురి కాలనీలో గానీ ఆయనకు సొంతిల్లు లేదు. దీంతో అద్దె ఇంటిలోనే కాలం గడుపుతున్నారు. పైసా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ లేకపోవడంతో రెండో కొడుకు కష్టంతో బతుకు వెళ్లదీస్తున్నారు.  రాజ్‌ కుమార్‌ పరిస్థితి చూసిన కిరణ్‌ మనం కూడా సాయం చేద్దామని ఆ సంస్థ వాట్సాప్ గ్రూపులో పెట్టిన మెసేజ్ కి పలువురు ఔత్సాహిక నటులు, సినీ జర్నలిస్టులు స్పందించారు. వారందించిన మొత్తాన్ని కిరణ్‌ స్వయంగా వెళ్లి రాజ్‌కుమార్‌కు అందించారు. ఇక చిరంజీవి స్పందించాల్సి ఉంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.