(Local) Wed, 16 Oct, 2019

‘ఎంత మంచివాడవురా’ టీజర్ రిలీజ్...

October 09, 2019,   7:38 PM IST
Share on:
‘ఎంత మంచివాడవురా’ టీజర్ రిలీజ్...

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా శతమానం భవతి’ ఫేమ్ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్) లిమిటెడ్ సంస్థ నిర్మిస్తుంది. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో, ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తున్న ‘ఎంత మంచివాడవురా’ టీజర్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు. అయితే మూవీకి సంబంధించి నందమూరి కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ టీజర్ ను కట్ చేశారు.  కళ్యాణ్ రామ్ కుటుంబ సభ్యులు కళ్యాణ్ రామ్ ను ఒక్కొక్కరు ఒక్కోరకంగా పిలుస్తూ.. మంచివాడు అని చెప్తుంటారు. టీజర్ లో... ''మా మనవడు శివ మంచోళ్లకే మంచివాడు. నా కొడుకు ఆచార్య చాలా మంచివాడు. మా అల్లుడు బాలు చాలా మంచోడు. నా తమ్ముడు సూర్య ఎంత మంచోడో. నా అన్నయ్య రిషి చాలా మంచోడు. నా హీరో బాలు చాలా మంచోడు'' ఇలా కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ గురించి గొప్పగా చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది. మరోపక్క కళ్యాణ్ రామ్ రౌడీలను కొడుతూ కనిపిస్తాడు. 

‘అందరూ మంచోడు, మంచోడు అంటున్నారు.. మరీ ఇలా కొడుతున్నావేంట్రా?.. అంటే.. ‘రాముడు కూడా మంచోడేరా.. కానీ రావణాసూరుణ్ణి వేసెయ్యలా’? అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ హైలెట్ అయ్యింది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ‘మళ్లీ ఎప్పుడొస్తావ్ రా’? అని తనికెళ్ల భరణి అడగితే.. కళ్యాణ్ రామ్ ‘సంక్రాంతికి వస్తాను నాన్నా’ అని చెప్పడంతో టీజర్ ఎండ్ అవుతుంది. లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయనిపిస్తుంది.. 2020 సంక్రాంతికి ‘ఎంత మంచివాడవురా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సంబంధిత వర్గం
'ఎంత మంచివాడవురా' టీజర్ అప్డేట్....
'ఎంత మంచివాడవురా' టీజర్ అప్డేట్....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.