(Local) Fri, 15 Nov, 2019

మెరుపు సమ్మెకు దిగిన లుఫ్తాన్సా సిబ్బంది

November 08, 2019,   8:04 PM IST
Share on:
మెరుపు సమ్మెకు దిగిన లుఫ్తాన్సా సిబ్బంది

లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది జర్మనీలో గురువారం మెరుపు సమ్మెకు దిగారు. దీంతో వేలాదిమంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా గురువారం నుంచి 48 గంటలపాటు సమ్మె కొనసాగుతుందని ఫ్లైట్ అటెండెంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు చెప్పారు. వేతన చెల్లింపులు, ఇతర సమస్యల విషయమై యాజమాన్యంతో జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన వల్లే సమ్మెకు దిగామని వారు ఈ సందర్భంగా స్పష్టంచేశారు. సమ్మె కారణంగా గురువారం సుమారు 700 సర్వీసులను రద్దు చేశామని, శుక్రవారం 600 వరకు సర్వీసులను రద్దు చేస్తామని లుఫ్తాన్సా విమానయాన సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వర్గం
నవయుగా కార్యాలయం ముందు కార్మికులు ధర్నా
నవయుగా కార్యాలయం ముందు కార్మికులు ధర్నా

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.