(Local) Sun, 15 Dec, 2019

వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా

November 30, 2019,   4:02 PM IST
Share on:
వెబ్ సిరీస్‌లో నటించనున్న  తమన్నా

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా ఓ వెబ్ సిరీస్‌కి సంతకం చేసింది. ‘నవంబర్ స్టోరి’ అనేది టైటిల్. తండ్రి కూతుళ్ల మధ్య సాగే ఆసక్తికర డ్రామాతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. దుర్మార్గుడైన తండ్రి వల్ల కూతురు పడే పాట్లు ఏమిటన్నది తెరపై చూపిస్తారట. ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆ మేరకు ఇప్పటికే మిల్కీ బ్యూటీ ఒప్పందం కుదుర్చుకుందని తెలిసింది. రామ్ సుబ్రమణియన్ దర్శకత్వంలో వికటన్ గ్రూప్ ఈ వెబ్ సిరీస్‌ని నిర్మిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో దీనిని తెరకెక్కించనున్నారు. ఇతర నాయికల్లానే ఓటీటీ వేదికకు వస్తున్న తమన్నా .. ఇక్కడ బంగారు భవిష్యత్ ఉంటుందని నిరూపించుకునేందుకు ఎక్కువ స్కోప్ ఉందని తెలిపింది. ఐదు సినిమాల్లో నటించినంత అనుభవం ఒకే వెబ్ సిరీస్ తో సాధ్యమని నమ్మకం వ్యక్తం చేసింది. ట్యాలెంటును లోతుగా ఆవిష్కరించేందుకు.. ప్రేక్షకాభిమానుల నుంచి మెప్పు పొందేందుకు ఓటీటీ వేదిక ఎక్కువ స్కోప్ నిస్తుందని వెల్లడించింది. ఇలాంటి మరిన్ని వెబ్ సిరీస్ లలో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.