(Local) Mon, 09 Dec, 2019

 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర్

November 30, 2019,   3:23 PM IST
Share on:
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన  కేటీఆర ...

 బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా  మంత్రి కెటిఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ. 100 కోట్లతో బాన్సువాడలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. మినీ ట్యాంక్ బండ్, మినీ స్టేడియం, డ్రైనేజ్ లు, అంతర్గతరోడ్లు సిసి మెయిన్ రోడ్డు ప్రారంభించారు, దివ్యాంగులకు ట్రై సైకిళ్లను అందజేసారు . కెటిఆర్ మాట్లాడుతు..  బాన్సువాడను మున్సిపల్‌గా మార్చేందుకు కృషి చేసిన  స్పీకర్ పోచారం ధన్యవాదాలు తెలిపారు. నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. గృహ నిర్మాణానికి పట్టణంలో రూ.5.30లక్షలు, గ్రామాల్లో రూ.5లక్షలు ఇస్తున్నారని పేర్కొన్నారు. బాన్సువాడలో ఏ ఒక్క కుటుంబం కూడా కిరాయి ఉండకుండా నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

సంబంధిత వర్గం
హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో లైన్ ప్రారంభం
హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో లైన్ ప్రారంభం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.