(Local) Wed, 16 Oct, 2019

మోదీ, జిన్‌పింగ్‌ పర్యటనకు ముస్తాబవుతున్న మహాబలిపురం....

October 09, 2019,   5:58 PM IST
Share on:
మోదీ, జిన్‌పింగ్‌ పర్యటనకు ముస్తాబవుతున్న మహాబలిపు ...

ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య ఈ నెల 11, 12వ తేదీల్లో చెన్నై వేదిక‌గా భేటీ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీ కోసం తమిళనాడులో మహాబలిపురం ముస్తాబవుతోంది. అక్టోబర్ 11వ తేదీ నుండి 3 రోజులపాటు ఇద్దరు నేతలు వివిధ అంశాలపై ఇక్కడ చర్చించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. కొద్దిరోజుల నుంచి మహాబలిపురం సముద్ర తీరంలోని కడైకం ఆలయం, పంచరథాల ఆలయాలు, అక్కడి శిల్ప సంపదను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. మమల్లాపురంలోని అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశంతోపాటు, సముద్ర తీరాన ఉన్న ఆలయంలో ఇద్దరు నేతలు గంటపాటు సమావేశమవుతారు. ఈ సందర్భంగా పురాతన దేవాలయంలో సాంస్కృతి కార్యక్రమం నిర్వహిస్తారు. వీరి పర్యటన నేపథ్యంలో చెన్నై నుంచి మహాబలిపురం వరకు రహదారిని అందంగా ముస్తాబు చేశారు. ఈ మార్గంతోపాటు మహాబలిపురాన్ని భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. ఇద్దరు ప్రముఖులు సందర్శించనున్న ప్రాంతాలను పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్నారు. వెన్నముద్ద రాయి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహాబలిపురం పూర్తిగా పచ్చదనాన్ని సంతరించుకుంది. నేతలు బస చేయనున్న తాజ్‌ హోటల్‌కు మెరుగులు అద్దుతున్నారు. ఈ సందర్భంగా చెన్నైలోని పలువురు ఛైనా దేశీయులు జిన్‌పింగ్‌కు స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
రఘురాం రాజన్ పై విమర్శనాస్త్రాలను సంధించిన కేంద్ర  ...
రఘురాం రాజన్ పై విమర్శనాస్త్రాలను సంధించిన కేంద్ర ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.