(Local) Thu, 05 Dec, 2019

రొమాంటిక్ హీరోకి భార్యగా రమ్యకృష్ణ...

November 17, 2019,   12:17 PM IST
Share on:
రొమాంటిక్ హీరోకి భార్యగా రమ్యకృష్ణ...

వెండితెరపై కొందరు నటులు కనిపిస్తే చాలు....అని ఎదురుచూసే అభిమానులు ఎందరో ఉన్నారు. అలాంటి నటుల్లో మాధవన్, రమ్యకృష్ణ అంటే కాంబోలో చిత్రం అంటే ఫాన్స్ కి పండగే. తాజాగా మాధ‌వ‌న్, ర‌మ్య‌కృష్ణ‌.. ఒక‌ప్పుడు వీరిద్ద‌రు లీడ్ రోల్స్‌లో క‌నిపించి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందించారు. మాధ‌వ‌న్ హీరోగా అనేక హిట్ చిత్రాలు రూపొంద‌గా, ర‌మ్య‌కృష్ణ క‌థానాయిక‌గా ఎంతగానో అల‌రించింది. అయితే ఇప్పుడు వీరిద్ద‌రు ఎక్కువ‌గా సపోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లోనే కనిపిస్తున్నారు. తాజాగా వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న ఓ చిత్రంలో భార్య భ‌ర్త‌లుగా క‌నిపించ‌నున్నార‌ట‌. వ‌రుణ్ తండ్రిగా మాధ‌వ‌న్ న‌టిస్తే, త‌ల్లిగా ర‌మ్య‌కృష్ణ క‌నిపించ‌నుంద‌ట‌. వారిద్ద‌రి పాత్ర‌ల‌కి మంచి ప్రాధాన్యత‌ ఉండ‌డం వ‌ల‌న‌నే చిత్రబృందం వీరిద్ద‌రిని ఆ పాత్ర‌ల‌కి ఎంపిక చేసిందట‌. దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రావ‌ల‌సి ఉంది. ఈ చిత్రం కిరణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో వ‌రుణ్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. మ‌రోవైపు మాధ‌వ‌న్ .. అనుష్క న‌టిస్తున్న నిశ్శ‌బ్ధం చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుండ‌గా, ర‌మ్య‌కృష్ణ రొమాంటిక్‌, రంగ‌మార్తాండ చిత్రాల‌తో బిజీగా ఉన్నారు.

సంబంధిత వర్గం
తండ్రి బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేసిన వరుణ్, నిహ ...
తండ్రి బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేసిన వరుణ్, నిహ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.