(Local) Mon, 20 Sep, 2021

రేపే గ్రాండ్‌గా వస్తున్న ‘రాగల 24 గంటల్లో’....

November 21, 2019,   6:21 PM IST
Share on:
రేపే గ్రాండ్‌గా వస్తున్న ‘రాగల 24 గంటల్లో’....

విలక్షణ నటుడు సత్యదేవ్‌, ఈషారెబ్బా, శ్రీరాం, గణేష్‌ వెంకట్రామన్‌, ముస్కాన్‌ సేథీ ప్రముఖ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్‌ సమర్పణలో శ్రీ నవహాస్‌ క్రియేషన్స్‌ బానర్‌ పై ‘ఢమరుకం’ ఫేమ్‌ శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వంలో నవ నిర్మాత శ్రీనివాస్‌ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రం రేపు గ్రాండ్‌గా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ దసపల్లా హోటల్‌లో జరిగిన గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నిర్వహించారు చిత్రయూనిట్…ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ మాట్లాడుతూ..నేను సాధారణంగా లాస్ట్‌లో మాట్లాడుకుంటాను. ఎందుకంటే ఏదైనా మాట్లాడటానికి పాయింట్స్ తీసుకోవచ్చని. కానీ ఇప్పుడు మాత్రం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడొద్దని ఫిక్సైపోయాను. ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత ఇంకేం ఉండదు. రాగల 24 గంటల్లో సినిమా గురించి చెప్పాలంటే.. కథ విన్న తర్వాత భయపడ్డాను. రాహుల్ అనే పాత్ర చేయడానికి భయపడ్డాను.. 100 పర్సెంట్ ఇవ్వగలనా లేదా అని భయపడ్డాను. ఈ కారెక్టర్ తీసుకోడానికి ప్రధాన కారణం రాసిన విధానం. వీళ్లంతా నన్నంతా బాగా పొగిడేసరికి హ్యాపీ అనిపించింది కానీ ఒక్క విషయం చెప్పాలి.. స్క్రీన్ ప్లే బేస్డ్ సస్పెన్స్ అన్నారు కానీ కథ కూడా అద్భుతంగా ఉంది. కారెక్టరైజేషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. నాది, ఇషా, శ్రీరామ్, రవి అంతా అద్భుతమైన కారెక్టర్స్ అని తెలిపారు. 

చిత్ర నిర్మాత శ్రీనివాస్‌ కానూరి మాట్లాడుతూ – ”నమ్మకమే జీవితం. జీవితమే నమ్మకం అన్న పాలసీ ప్రకారం ఈ సినిమా నిర్మించడం జరిగింది. రఘుగారు, అంజిగారు చాలా బాగా వర్క్‌ చేశారు. శ్రీనివాస్‌ రెడ్డి లాంటి మంచి దర్శకుడు నా మొదటి సినిమాకు దొరకడం నా అదృష్టం. సత్య దేవ్‌, ఈషా చాలా బాగా నటించారు. వారిద్దరికీ మంచి ఫ్యూచర్‌ ఉంటుంది. అలాగే నా సినిమా వీరిద్దరికి మంచి ఫ్లాట్‌ ఫామ్‌ అవుతుందని గట్టిగా చెప్పగలను. ‘బ్లఫ్‌ మాస్టర్‌’ సినిమా చూసి సత్య దేవ్‌గారిని ఈ సినిమా కోసం తీసుకోవడం జరిగింది. ఈ కథ మొదట అనుష్కగారిని అనుకున్నాం. కానీ కుదరలేదు. తర్వాత కాజల్‌, రెజీనా, రాశిఖన్నా లకు ఈ కథ బాగా నచ్చింది కానీ డేట్స్‌ కుదరక సినిమా చేయలేదు. అయితే నా మొదటి సినిమాకే ఎక్కువమంది తెలుగువారికి అవకాశం ఇచ్చానని గొప్పగా చెప్పగలను. రఘు చాలా కష్టపడి సినిమాకి మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా నా రిక్వెస్ట్‌ ఒక్కటే. మంచి ఓపెనింగ్స్‌ ఉంటేనే సినిమా నిలుస్తుంది అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ థియేటర్‌లో సినిమా చూడండి. మంచి సినిమా చూశాం అనే భావనతో బయటకు వస్తారు. ప్రివ్యూ చూసి ప్రతి ఒక్కరూ అభినందించారు. ఇంకా ఎక్కువ మందితో ఈ సినిమా విజయోత్సవ సభ ఏర్పాటు చేస్తాను” అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నిర్మాత కానూరి శ్రీనివాస్ అన్న ప్యాషన్‌తో వచ్చాడు. మంచి సినిమా చేయాలి అని వచ్చాడు. అద్భుతమైన సినిమా చేసాం.. ఆయన మాటల్లోనే కాన్ఫిడెన్స్ లెవల్స్ తెలుస్తుంది. నవంబర్ 22న మీకు తెలుస్తుంది. నా గత సినిమాల మాదిరే మరో హిట్ కొట్టి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా వెలుగొందుతానని నమ్ముతున్నాను. మా నిర్మాత లాంటి వాళ్లు చాలా రేర్‌గా ఉంటారు. ఇలాంటి సినిమా చేస్తున్నపుడు వెనక నుంచి చెడుచేసే పర్సన్స్ కూడా ఉంటారు. అన్నయ్య విజయం వెనక మాత్రం వదిన ఉన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత బంధు మిత్రలుతో పాటు తల్లిదండ్రులు కూడా మా కానూరి శ్రీనివాస్ గొప్ప సినిమా చేసాడని చెప్పుకుంటారు. ఎక్కడైనా సక్సెస్ అనేది ఇంపార్టెంట్.. 360 డిగ్రీస్‌లో ఎవరూ కనిపించరు. కానీ నేనున్న ఈ స్థితిలో.. ఢమరుకం తర్వాత నేనున్న స్థితిలో నేను పడుతున్న స్ట్రగుల్స్ అన్ని చూసి మాటిచ్చి.. మాట కోసం ఈ చిత్రం తీసారు. చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకొచ్చి.. పక్కనుండి నడిపిస్తున్నారు. ప్రతీ విషయంలో నన్ను ముందుకు నడిపిస్తున్నారు. నేను బతికున్నంత వరకు ఆయన్ని మాత్రం నేను వదలను. మళ్లీ నాకు ఓ మార్గాన్ని చూపించారు. చాలా థ్యాంక్స్ అన్నా. సినిమా గురించి చెప్పాలంటే మేం చేసినటువంటి రాగల 24 గంటల్లో సినిమా కచ్చితంగా నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా అవుతుంది. తమ సినిమా గురించి ఎవరికి వాళ్లు అలాగే చెప్పుకున్నా కూడా నిజంగానే మంచి సినిమా చేసాం. ఈ సినిమాకు మంచి ఆర్టిస్టులు దొరికారు.. సినిమాలో నటించిన వాళ్లందరికీ థ్యాంక్స్. సత్యదేవ్ నిజంగా గొప్పనటుడు.. హీరోయిన్ ఇషా రెబ్బా కూడా చాలా అద్భుతంగా చేసింది. ఈ సినిమా తర్వాత నయనతార, అనుష్క లాంటి అందమైన తెలుగు హీరోయిన్ వచ్చింది అనుకుంటారు.. శ్రీరామ్ గారు కూడా అద్భుతంగా నటించాడు. పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసాడు. మిగిలిన వాళ్లు కూడా అంతా బాగా చేసారు అని తెలిపారు.

You have an error in your SQL syntax; check the manual that corresponds to your MySQL server version for the right syntax to use near 'MoviePreReleaseEvent)," and p.slug!="ragala-24-gantallo-movie-pre-release-event-' at line 6
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.