(Local) Tue, 20 Aug, 2019

రైతుల ఖాతాలోకి రైతు బంధు నగదు జమ

June 12, 2019,   2:08 PM IST
Share on:

రాష్ట్రంలోని 21.22 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఖరీఫ్ అవసరాలకు రైతుబంధు పధకంలో భాగంగా రూ.2,233.16 కోట్లు జమ చేశారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత అధికారులు రైతుబంధు పధకం నిధులను విడతల వారీగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు విడతలుగా రైతుల ఖాతాల్లోకి రిజర్వుబ్యాంకు ఈ-కుబేర్‌ ద్వారా నేరుగా రైతుల ఖాతాలోకి రైతుబంధు డబ్బులు జమ చేస్తోంది. రైతుబంధు అకౌంట్ నెంబరు మార్చుకోవాలనుకునే రైతులు సమీప వ్యవసాయ కార్యాలయాలను సంప్రదించాలని మంత్రి సూచించారు.రాష్ట్రానికి రుతుపవనాలు రానున్న నేపథ్యంలో రైతుబంధు డబ్బులు త్వరగా జమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని మంత్రి తెలిపారు. ధాన్యం డబ్బులు, రైతుబంధు నిధుల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి భరోసా ఇచ్చారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.