(Local) Fri, 22 Nov, 2019

`ద‌ర్బార్‌` మోష‌న్ పోస్ట‌ర్స్ విడుద‌ల చేసిన సూప‌ర్ స్టార్స్...

November 08, 2019,   4:41 PM IST
Share on:
`ద‌ర్బార్‌` మోష‌న్ పోస్ట‌ర్స్ విడుద‌ల చేసిన సూప‌ర్ ...

లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ. సుభాస్కరన్‌ నిర్మాణంలో ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం 'దర్బార్'. ఈ చిత్రంలో సూపర్ స్టార్ సరసన లేడి సూపర్ స్టార్ నయనతార జంటగా కనిపించబోతోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కాగా ఇప్పుడు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘దర్బార్’ మోషన్ పోస్టర్  నాలుగు బాషల్లో విడుదల చేశారు. తమిళ్ పోస్టర్ ‘విశ్వనాయకుడు’ కమల్ హాసన్, హిందీ మోషన్ పోస్టర్ సల్మాన్ ఖాన్.. మలయాళ పోస్టర్ ‘కంప్లీట్ యాక్టర్’ మోహన్ లాల్ విడుదల చేశారు....ఈ చిత్ర తెలుగు మోషన్‌పోస్టర్‌ను గురువారం హీరో మహేష్‌బాబు విడుదలచేశారు. ఈ మోషన్ పోస్టర్‌లో ఖాకీ దుస్తుల్లో నేరస్తులపై కత్తి దూస్తూ రజనీకాంత్ కనిపిస్తున్నారు దర్బార్ మోషన్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకోవడం ఆనందంగా ఉంది. రజనీకాంత్‌పై ఉన్న అభిమానం, గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటాయి అని మహేష్‌బాబు ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు.  పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ ఆదిత్య అరుణాచలంగా కొత్త లుక్‌లో రజనీని చూసి, ఆయన అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదలచేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
 

సంబంధిత వర్గం
రేపువిశ్వనటుడి కాలికి ఆపరేషన్..
రేపువిశ్వనటుడి కాలికి ఆపరేషన్..
‘దర్బార్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్న నలుగురు సూ ...
‘దర్బార్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్న నలుగురు సూ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.