(Local) Wed, 15 Jul, 2020

నెక్స్ట్ మూవీ టైటిల్ రివీల్ చేసిన ఆర్జీవీ...

November 16, 2019,   6:29 PM IST
Share on:
నెక్స్ట్ మూవీ టైటిల్  రివీల్ చేసిన ఆర్జీవీ...

వివాదాల వర్మకి సోషల్ మీడియా అనేది బాగా ఉపయోగపడుతోంది...ఈ సోషల్ మాధ్యమాలను వర్మ వాడుకున్నట్టు ఇంకెవరు ఉపయోగించలేరేమో...అసలు రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ లేకుండా బతకలేడు అని తెలుస్తుంది ప్రస్తుతం చేస్తున్న పనులు చూస్తుంటే, కమ్మ రాజ్యం లో కడప రెడ్లు చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా వున్న రామ్ గోపాల్ వర్మ, ఈ చిత్రానికి పబ్లిసిటీని పైసా ఖర్చు లేకుండా చేస్తున్నారు. ట్రైలర్ తో తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ ఆకట్టుకోవడం లో సఫలమయ్యాడని చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్ ర్రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలను తన చిత్రం లో పాత్రలుగా తీర్చి దిద్దాడు. అయితే ఈ చిత్రం పై విమర్శలు వస్తున్నప్పటికీ రామ్ గోపాల వర్మ వెనకడుగు వేయడం లేదు.

వల్లభనేని వంశి టీడీపీ నేతల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇంటర్వ్యూ లలో సంచలన వ్యాఖ్యలు చేసారు. మొన్నటి వరకు టీడీపీ లో ఉండి, బయటికి రాగానే టీడీపీ ని విమర్శిస్తూ, వైసీపీ పార్టీ లో చేరే ఆలోచనలో వున్నారు. ఈ విషయాన్నీ ప్రస్తావిస్తూ వంశీ ని చూసాక కమ్మ రాజ్యం లో కడప రెడ్లు చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేయడానికి ఒక ఐడియా వచ్చిందని అన్నారు. అంతే కాకుండా దానికి టైటిల్ ని కూడా అనౌన్స్ చేసారు. రెడ్డి రాజ్యానికి కమ్మ ఫాన్స్ అంటూ తెలిపారు. ఈ విషయం లో నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.