(Local) Mon, 17 Jun, 2019

ఏంటి సమంత తల్లి కాబోతుందా?

June 12, 2019,   1:16 PM IST
Share on:

సమంత ఈ పేరు చాలు తెలుగు, తమిళ్ భాషల్లో కుర్రకారు గుండేళ్లో గుర్రాలు పరిగేడుతాయి. వరుస విజయాలతో దూసుకెళుతున్న సమంత కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకూడదని నిర్ణయించుకుని ఆ దిశగా విభిన్నమైన పాత్రల వైపు మొగ్గు చూపుతూ నటిస్తోంది. ఈ మేరకు ఆమె రీసెంట్ గా ’ ఓ బేబీ‘ అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం సమంత వెరైటీగా ప్రమోషన్స్ చేస్తోంది. వచ్చే నెల 5 ’ఓ బేబీ‘ విడుదల కానుంది. ఈ క్రమంలో సమంత తన ట్విట్టర్ ఎకౌంట్ ఐడిని "బేబీ అక్కినేని" గా  మార్చుకుంది. సమంత ఇలా తన ట్విట్టర్ ఎకౌంట్ ఐడిని మార్చుకోవడానికి ఏదో ప్రత్యేకత ఉందని సోషల్ మీడియాలో ముచ్చట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో సమంత తల్లి కాబోతుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే తాను తల్లి కాబోతున్నట్టు వస్తున్న వార్తలను సమంత ఖండించింది. మీరు తల్లి కాబోతున్నారా అని ఓ అభిమాని సమంతను అడిగాడు. దీంతో సమంత తీవ్ర స్థాయిలో మండిపడి మీకు తెలిస్తే కాసింత నాక్కూడా చెప్పండంటూ ట్వీట్  చేసింది. కాగా ’ ఓ బేబీ ‘ సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది...

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.